News November 19, 2025
MBNR: వాలీబాల్ ఎంపికలు.. విజేతలు వీరే!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో బాల, బాలికలకు వాలీబాల్ ఎంపికలు నిర్వహించారు. మొత్తం 500 మంది క్రీడాకారులు పాల్గొనగా..
✒బాలికల విభాగంలో
1.బాలానగర్
2.మహమ్మదాబాద్
✒బాలుర విభాగంలో
1.నవాబ్ పేట
2. మహబూబ్ నగర్ జట్లు గెలిచినట్టు ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. ఎంపికైన వారికి ఉమ్మడి జిల్లా సెలక్షన్‌కు పంపిస్తామన్నారు.
Similar News
News January 16, 2026
NGKL: 1,148 టన్నుల యూరియా నిల్వలు- కలెక్టర్

నాగర్‌కర్నూల్ జిల్లాలో శుక్రవారం నాటికి 1,148 టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ఈ నెలలో 5,689 టన్నుల యూరియా జిల్లాకు రానుందని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 19,280 టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. ఇప్పటివరకు 65 శాతం మంది రైతులు వారి పంటలకు అవసరమైన యూరియాను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
News January 16, 2026
2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం: సీఎం

TG: తాను ఓడిపోయిన వారి గురించి మాట్లాడదలుచుకోలేదని సీఎం రేవంత్ పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘నాకిచ్చిన బాధ్యతతో పని చేయాలి అనుకుంటున్నా. ఇతరుల గురించి మాట్లాడి టైమ్ వేస్ట్ చేయను. రాబోయే ఎన్నికలతో పాటు 2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం’ అని నిర్మల్ సభలో స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరిస్తామని హామీ ఇచ్చారు.
News January 16, 2026
టోల్ ప్లాజాల దగ్గర ఇక నో క్యాష్ పేమెంట్స్?

వంద శాతం డిజిటల్ టోలింగ్ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. టోల్ ప్లాజాల దగ్గర క్యాష్ పేమెంట్స్‌ను పూర్తిగా నిలిపేసి కేవలం FASTag లేదా UPI ద్వారానే వసూలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. చిల్లర సమస్యలు, ట్రాఫిక్ జామ్‌లకు స్వస్తి పలకడమే లక్ష్యంగా ఈ మార్పు తీసుకురానున్నారు. దీనిపై ఇంకా అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు.


