News November 19, 2025

MBNR: వాలీబాల్ ఎంపికలు.. విజేతలు వీరే!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో బాల, బాలికలకు వాలీబాల్ ఎంపికలు నిర్వహించారు. మొత్తం 500 మంది క్రీడాకారులు పాల్గొనగా..
✒బాలికల విభాగంలో
1.బాలానగర్
2.మహమ్మదాబాద్
✒బాలుర విభాగంలో
1.నవాబ్ పేట
2. మహబూబ్ నగర్ జట్లు గెలిచినట్టు ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. ఎంపికైన వారికి ఉమ్మడి జిల్లా సెలక్షన్‌కు పంపిస్తామన్నారు.

Similar News

News January 22, 2026

బీఈడీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ బీఈడీ నాలుగో సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు గురువారం విడుదల చేశారు. మొత్తం 144 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, కేవలం 28 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ https://rayalaseemauniversity.ac.in లో చూసుకోవచ్చని ఆయన సూచించారు.

News January 22, 2026

నల్గొండలో మొదలైన రాజకీయ సెగలు

image

నల్గొండలో మున్సిపల్ పోరుకు ముందే రాజకీయ క్షేత్రం రగులుతోంది. అధికార ‘హస్తం’లో ఆశావహుల తాకిడి పెరగడంతో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. రెబల్స్ భయం నేతలకు గుబులు పుట్టిస్తోంది. అటు ‘గులాబీ’ దళాన్ని వలసలు వేధిస్తుంటే, ‘కమలం’లో అంతర్గత విభేదాలు శాపంగా మారాయి. స్వతంత్రుల వల్ల ఎవరి ఓట్లు చీలుతాయో చూడాలి. ఓటరు నాడి ఎటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

News January 22, 2026

కామారెడ్డి మున్సిపాలిటీకి 39 ఏళ్ల చరిత్ర..!

image

కామారెడ్డి గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా 1987లో ఏర్పడింది. మొదట్లో 24 వార్డులతో, జనాభా పెరగడంతో 33 వార్డులుగా మారి పాలనను అందించింది. 6 ఏళ్ల క్రితం చుట్టుపక్కల గ్రామాలైన దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, అడ్లూరు, రామేశ్వరపల్లి, పాతరాజంపేట, టేక్రియాల్ గ్రామాలను విలీనం చేసుకొని 49 వార్డులుగా మారింది. ఇప్పటి వరకు టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఛైర్మన్/ఛైర్‌పర్సన్‌లుగా వ్యవహరించారు.