News May 1, 2024
MBNR: సైబర్ వలలో బాధితుడు.. డబ్బు మాయం

చరవాణిలో ఆట ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్న సంఘటన మంగళవారం ఊర్కొండ మండలంలో చోటుచేసుకుంది. SI వీరబాబు కథనం ప్రకారం.. నర్సంపల్లికి చెందిన వీరెడ్డి శేఖర్ రెడ్డి కుమారుడు ప్రతాప్ రెడ్డి చరవాణిలో ఆట ఆడుతుండగా మనీ 777 క్యాసినో అనే లింక్ రాగా లింక్ పై క్లిక్ చేశాడు. దీంతో 5 విడతలుగా రూ.67,899 బ్యాంకు ఖాతాలో నుంచి బదిలీ అయ్యాయి. 1930కు సమాచారం ఇచ్చి PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News December 10, 2025
MBNR: పల్లె బాట పట్టిన పట్టణవాసులు

మహబూబ్‌నగర్ జిల్లాలో రేపు గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదు, ముంబై వలస వెళ్లిన కార్మికులు తిరిగి తమ సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులలో రద్దీ గణనీయంగా పెరిగింది. కొందరు సొంత వాహనాలతో తమ గ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు. దీంతో 44వ జాతీయ రహదారి రద్దీగా మారింది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.
News December 10, 2025
నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ

నిష్పక్షపాతంగా ప్రతి అధికారి విధులు నిర్వహించాలని ఎస్పీ జానకి బుధవారం సూచించారు. రేపు మొదటి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వికలాంగులకు సహాయ సహకారాలు అందించాలని, ఎల్లప్పుడూ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ ఉండాలని సూచించారు.
News December 10, 2025
మహబూబ్‌నగర్‌లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

మహబూబ్‌నగర్ జిల్లాలో గత ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. గండీడ్ మండలం సల్కర్‌పేటలో అత్యల్పంగా 9.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిడ్జిల్ మండలం దోనూరులో 9.3, మిడ్జిల్‌లో 10.1, కోయిలకొండ సిరి వెంకటాపురం, భూత్‌పూర్‌లో 10.5, దేవరకద్రలో 10.9, కొత్త మొల్గరలో 11.4, జానంపేటలో 11.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


