News November 2, 2025

MBNR: మద్యం లక్కీడిప్.. పీఈటీ సస్పెండ్

image

అత్యాశకు పోయి ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన ఓ స్కూల్ పీఈటీ (PET) ఉదంతం జిల్లాలో చర్చనీయాంశమైంది. రాంనగర్‌లోని బాలికల హైస్కూల్‌లో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప, ఇటీవల జరిగిన మద్యం టెండర్లలో పాల్గొని లక్కీడిప్‌లో ధర్మాపూర్ వైన్ షాపును దక్కించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి టెండర్లలో పాల్గొనడంపై అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. విచారణ అనంతరం డీఈఓ ప్రవీణ్ కుమార్ ఆమెను సస్పెండ్ చేశారు.

Similar News

News November 2, 2025

పెంబి: గుంతలో పడి చిన్నారి మృతి

image

ఇంటి నిర్మాణం కోసం తీసిన పిల్లర్ల గుంతలో పడి చిన్నారి నాగపుష్ప(6) మృతి చెందింది. ఈ ఘటన నిర్మల్(D) పెంబి (M) వేనునగర్‌లో జరిగింది. ఎస్ఐ హన్మాండ్లు తెలిపిన వివరాలు.. ఆత్రం రాము-రేణుక దంపతుల కుమార్తె నాగపుష్ప శనివారం సాయంత్రం అంగన్వాడీ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఇందిరమ్మ ఇంటి కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News November 2, 2025

ఈ దున్న ఖరీదు రూ. 23 కోట్లు.. ఎందుకంత స్పెషల్?

image

హరియాణాకు చెందిన అన్మోల్ అనే ఈ దున్న రాజస్థాన్‌ పుష్కర్ పశువుల సంతలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1,500 Kgల బరువుండే ఈ దున్న ఖరీదు రూ.23 కోట్ల పైనే. దీని వీర్యానికి చాలా డిమాండ్ ఉంది. వారానికి 2సార్లు అన్మోల్ వీర్యాన్ని సేకరించి విక్రయిస్తారు. ఇలా నెలకు కనీసం రూ.5 లక్షల ఆదాయం వస్తోంది. దీనికి ఆహారం కోసం నెలకు రూ.50 వేల వరకు ఖర్చవుతోంది.✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News November 2, 2025

ప్రకాశం ప్రజలకు ఎస్పీ కీలక సూచనలు..!

image

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని భక్తులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా తీర ప్రాంతాలు, శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపాలు వెలిగించే సమయంలో భక్తితో పాటు జాగ్రత్త వహించాలన్నారు. తీర ప్రాంతాలలో మన అప్రమత్తతే మనకు రక్ష అని సూచించారు.