News November 2, 2025
MBNR: రగ్బీ పోటీలు.. రేపే SELECTIONS

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్- 17 విభాగంలో రగ్బీ ఎంపికలు ఉంటాయని జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని స్టేడియం గ్రౌండ్‌లో రేపు అండర్- 17 విభాగంలో బాలబాలికల రగ్బీ ఎంపికలు ఉంటాయని, ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలని, ఆసక్తిగల క్రీడాకారులు స్కూల్ ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలని ఆమె సూచించారు.
Similar News
News November 2, 2025
అనంతపురం: డివైడర్‌ను ఢీకొన్న బైకు.. యువకుడు మృతి

అనంతపురం నగర శివారులో ఆదివారం రోడ్డు ప్రమాదంలో ఆలుమూరుకు చెందిన అవినాష్ అనే యువకుడు మృతి చెందాడు. అవినాష్ బైక్‌పై అనంతపురం నుంచి హిందూపూర్‌కి వెళుతుండగా డివైడర్‌ను ఢీకొని కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అవినాష్‌కు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అవినాష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News November 2, 2025
ఏఐ ప్రభావాన్ని పెంచేలా నియామకాలు: సత్య నాదెళ్ల

భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ విస్తరణ స్మార్ట్‌గా ఉంటుందని సంస్థ CEO సత్య నాదెళ్ల తెలిపారు. కంపెనీలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని, ఈ నియామకాలు AI ప్రభావాన్ని పెంచేలా ఉంటాయని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా యాంత్రికంగా ఏదీ ఉండదన్నారు. AI సాయంతో వేగంగా పనిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. కాగా ఈ ఏడాది జూన్ నాటికి కంపెనీలో 2.28L మంది ఉద్యోగులున్నారు. పలు దశల్లో 15K మందికి లేఆఫ్స్ ఇచ్చింది.
News November 2, 2025
FINAL: టాస్ ఓడిన భారత్

WWCలో నేడు భారత్‌తో జరగాల్సిన ఫైనల్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
టీమ్ ఇండియా: షెఫాలీ వర్మ, స్మృతి మందాన, రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్(C), దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్ జోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్
సౌతాఫ్రికా: లారా (C), బ్రిట్స్, బాష్, సునే లుస్, కాప్, జఫ్టా, డ్రెక్సెన్, ట్రైయాన్, డి క్లెర్క్, ఖాక, మ్లాబా.


