News November 2, 2025
MBNR: రేలింగ్‌లో తలదూర్చిన బాలుడు SAFE..!

ఆడుకుంటూ 167 జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన రేలింగ్‌లో ఓ బాలుడు తల ఇరుక్కుని అవస్థలు పడ్డ ఘటన గండీడ్ మండలం జానంపల్లి గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వెన్నచేడ్ గ్రామానికి చెందిన నర్సింలు కుటుంబసమేతంగా మరో గ్రామానికి వెళుతున్న సమయంలో అతడి కుమారుడు శ్రీవర్ధన్ ఉన్నట్టుండి రేలింగ్‌లో తలదూర్చాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడి తలను బయటకు తీశారు.
Similar News
News November 2, 2025
కీలక వికెట్లు కోల్పోయిన భారత్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (25), గిల్ (15), కెప్టెన్ సూర్య (24) ఔటయ్యారు. తిలక్ వర్మ, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 8 ఓవర్లలో 82/3గా ఉంది. సూర్య సేన విజయానికి మరో 72 బంతుల్లో 105 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News November 2, 2025
సిరిసిల్ల: రేపటి నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్ళు

పత్తి పంటను సోమవారం నుండి కొనుగోలు చేసేందుకు సీసీఐ సిద్ధమైంది. వేములవాడ అర్బన్, రూరల్, చందుర్తి, బోయినపల్లి, కోనరావుపేట, రుద్రంగి మండలాలలో సుమారు మూడు లక్షల పైచిలుకు క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. నాంపల్లి, సంకేపల్లి, సుద్దాల లోని జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పత్తి విక్రయించే రైతులు ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
News November 2, 2025
కామారెడ్డిలో రేపు ప్రజావాణి

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అధికారులు ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు.


