News November 19, 2025
MBNR: వాలీబాల్ ఎంపికలు.. విజేతలు వీరే!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో బాల, బాలికలకు వాలీబాల్ ఎంపికలు నిర్వహించారు. మొత్తం 500 మంది క్రీడాకారులు పాల్గొనగా..
✒బాలికల విభాగంలో
1.బాలానగర్
2.మహమ్మదాబాద్
✒బాలుర విభాగంలో
1.నవాబ్ పేట
2. మహబూబ్ నగర్ జట్లు గెలిచినట్టు ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. ఎంపికైన వారికి ఉమ్మడి జిల్లా సెలక్షన్‌కు పంపిస్తామన్నారు.
Similar News
News December 7, 2025
HYD: జుట్టు ఊడుతోందా? మీకోసమే!

నగరవాసులకు ఒత్తైన జుట్టు కలగా మారుతోంది. మనోళ్లని హెయిర్‌లాస్, చుండ్రు తీవ్రంగా వేధిస్తున్నాయి. 30ఏళ్లలోపు 60% మందికి బాల్డ్‌హెడ్, 30% మందికి జట్టురాలుతోందని ఓ సర్వే వెల్లడించింది. ఒత్తిడి, హార్డ్ వాటర్‌కు VIT-D, VIT-B12 లోపాలు తోడవుతున్నాయి. VIT-D కణాలు ఉత్పత్తి చేసేందుకు దోహదపడుతుంది. ఎండతగలకుండా ఉదయాన్నే ఆఫీస్‌కు చేరుకునేవారిలో VIT-D లోపం, మూడ్ స్వింగ్స్, బరువుపెరుగుదల ఉంటాయని వివరించింది.
News December 7, 2025
తిరుపతి: లైంగిక వేధింపులు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెండ్

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో యువతిపై లైంగిక వేధింపులు విషయంలో ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో NSU అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్‌ను సస్పెండ్ చేసింది. కాగా..యువతి ఇచ్చిన ఫిర్యాదు కాపీలో సైతం లక్ష్మణ్ కుమార్ ఇబ్బంది పెట్టినట్లు ఉంది తప్ప ఎక్కడా గర్భవతి అయినట్లు కేసులో లేదు.
News December 7, 2025
కరీంనగర్: రెండో విడత 24 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం

గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ధ్రువీకరించారు. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 10 గ్రామాలు (చర్లపల్లి, కన్నాపూర్, అంబారిపేట తదితర), సిరిసిల్ల జిల్లాలో 9 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 3 (నాయకంపల్లి, బొట్ల వనపర్తి, బంజేరుపల్లి), కరీంనగర్ జిల్లాలో 2 పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు.


