News October 5, 2025
MBNR: FREE కోచింగ్.. రేపు లాస్ట్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గ్రామీణ యువతకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ Way2Newsతో తెలిపారు. CCTV కెమెరా ఇన్సాలేషన్ & సర్వీస్ కోర్సులలో ఉచిత శిక్షణ, వసతి ఉచితంగా ఇస్తున్నామని, వయస్సు 19-45 లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 6లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 99633 69361 సంప్రదించాలన్నారు.
Similar News
News January 25, 2026
NZB: మున్సిపల్ ఎన్నికల BRS ఇన్‌ఛార్జీలు వీరే..

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లాలోని కీలక ప్రాంతాలకు ఇన్‌ఛార్జీలను నియమించింది. నిజామాబాద్ కార్పొరేషన్ బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డికి అప్పగించారు. బోధన్ మున్సిపాలిటీకి దాదన్నగారి విఠల్ రావు, ఆర్మూర్‌కు చెరుమల్ల రాకేష్, బాల్కొండకు సుమనా రెడ్డిలను ఇన్‌ఛార్జీలుగా అధిష్ఠానం ఖరారు చేసింది. పార్టీ కేడర్‌ను సమన్వయం చేస్తూ గెలుపే లక్ష్యంగా వీరు పనిచేయనున్నారు.
News January 25, 2026
విడవలూరు: 54 మంది అరెస్ట్

విడవలూరు(M) పెద్దపాలెం బంకింగ్ కెనాల్ వద్ద కోడిపందేల స్థావరాలపై పోలీసులు <<18948979>>దాడులు<<>> చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 54 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ సురేంద్రబాబు తెలిపారు. వారి నుంచి రూ.6,24,500 నగదు, 9 కార్లు, 2 ఆటోలు,14 కోళ్లు, కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిర్వాహకులపై సైతం కేసులు నమోదు చేశామన్నారు.
News January 24, 2026
జూన్ లోపు టిడ్కో ఇళ్లు పంపిణీ చేయాలి: నారాయణ

అభివృద్ధి పనుల్లో ఎక్కడా రాజీ పడొద్దని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్ల పనులను వేగవంతం చేసి, జూన్ నాటికి లబ్ధిదారులకు అందజేయాలని స్పష్టం చేశారు.


