News August 11, 2025

MBNR: ITIలో నేటి నుంచి స్పాట్ అడ్మిషన్స్

image

మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మిగిలి ఉన్న సీట్లకు వాక్ ఇన్ అడ్మిషన్స్‌లకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ బి.శాంతయ్య Way2Newsతో తెలిపారు. ఐటీఐ/ఏటీసీలలో సీట్లు మిగిలి ఉన్నాయని, మెరిట్ ఆర్డర్‌పై సీట్లు పొందగలరు. ఈనెల 28 వరకు ఉదయం 9 గంటల నుంచి 11 వరకు మాత్రమే ఇంటర్వ్యూలు ఉంటాయని, అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
SHARE IT

Similar News

News March 16, 2026

HYD: ఆదివారం.. నెత్తురోడిన నగరం

image

నగరంలో వీకెండ్‌ రక్తపాతం జరిగింది. వరుస ప్రమాదాలు, దారుణ ఘటనలు కలకలం రేపాయి. మేడిపల్లిలో కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఒక్కగానొక్క కొడుకు అనాథయ్యాడు. ఉప్పల్‌లో కానిస్టేబుల్ సుధీర్‌ను దారుణంగా కత్తులతో హత్య చేశారు. శంషాబాద్‌లో వాహనం ఢీకొని విజయ్ (32) మృతి చెందాడు. గచ్చిబౌలిలో కర్ణాటక RTC బస్సు ఢీకొనడంతో బాలమ్మ (68) ప్రాణాలు కోల్పోయింది. ఒకే రోజు ఇన్ని దారుణాలు జరిగాయి.

News March 16, 2026

గ్యాస్ కొరత అంటూ అసత్య ప్రచారం.. వ్యక్తిపై కేసు: సీఐ

image

గ్యాస్ సిలిండర్ల కొరత అంటూ తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసిన యూట్యూబర్‌ అమీర్ బాషాపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో క్రైం నంబర్ 40/2026 U/S 353, 196, 356 BNS సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ జయనాయక్ తెలిపారు. ప్రజల్లో గందరగోళం, అశాంతి రేకెత్తించేలా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

News March 16, 2026

10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ మృతి

image

కర్నూలు జిల్లాలో పదో తరగతి పరీక్షల వేళ మొదటి రోజు విషాద ఘటన జరిగింది. కర్నూలులోని పరీక్ష కేంద్రం శ్రీ చైతన్య పాఠశాలకు చీఫ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ అన్వర్ బాషా అకస్మాత్తుగా మృతి చెందారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన అస్వస్థతకు గురవగా సిబ్బంది పరీక్ష కేంద్రం సమీపంలోని అమ్మ హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో మృతి చెందినట్లు డీఈవో కార్యాలయం ధ్రువీకరించింది.