News October 8, 2025
MBUలో వరుస వివాదాలకు అతనే కారణమా?

మోహన్ బాబు యూనివర్సిటీని వరుస వివాదాలు చుట్టుముట్టాయి. గతంలో ఓ ప్రముఖ పేపర్‌లో పనిచేసిన వ్యక్తి MBUలో కీలకంగా మారారు. యూనివర్సిటీ సమీపంలోని హాస్టల్స్, హోటల్స్ నుంచి రాయల్టీగా నగదు వసూళ్లు చేయించారంట. ప్రైవేట్ హాస్టల్ విద్యార్థుల నుంచి మెస్, ఇతర ఫీజుల పేరుతో అదనంగా వసూళ్లు చేయడంలో ఆయనదే కీలక పాత్ర అని సమాచారం. మోహన్ బాబు, విష్ణును అతనే తప్పుదోవ పట్టించారని మనోజ్ సైతం గతంలో ఆరోపించడం గమనార్హం.
Similar News
News January 18, 2026
ఇరాన్‌లో లీడర్‌షిప్ మారాలి: ట్రంప్

ఇరాన్‌లో కొత్త నాయకత్వం రావాల్సిన సమయం ఆసన్నమైందని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ‘సిక్ మ్యాన్’గా సంబోధించిన ఆయన దేశాన్ని హింసతో కాకుండా గౌరవంతో నడపాలని హితవు పలికారు. దేశాన్ని సరిగ్గా ఎలా నడపాలో తన నుంచి నేర్చుకోవాలన్నారు. ఇరాన్ నేతల తీరు వల్ల ఆ దేశంలో సాధారణ ప్రజలు నివసించలేని పరిస్థితి నెలకొందన్నారు.
News January 18, 2026
నెల్లూరోళ్లు రూ.23.17 కోట్ల మద్యం తాగేశారు..!

నెల్లూరు జిల్లాలో సంక్రాంతి ఘనంగా జరిగింది. 3రోజులు ప్రజలు ఆహ్లాదంగా గడిపారు. మందుబాబులు మత్తులో మునిగి తేలారు. ఫలితంగా జిల్లాలోని వైన్ షాపులన్నీ కిటకిటలాడాయి. పల్లె, పట్టణమనే తేడా లేకుండా జిల్లా అంతటా మద్యం ఏరులైపారింది. 14 నుంచి 16వ తేదీ రాత్రి వరకు రూ.23.17 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా రూ. 2.06. కోట్ల మేర వ్యాపారం జరిగింది.
News January 18, 2026
KGHలో శవాల మీద డబ్బులు వసూలు..!

KGHలో లంచం లేనిదే పని జరగదనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్ఛార్జ్ అయ్యే వరకు ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరికి లంచం ఇవ్వాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఆఖరికి శవాల మీదా డబ్బులు వసూలు చేస్తున్నారంట. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నిన్న KGHని విజిట్ చేయగా.. శానిటేషన్ వర్కర్ డబ్బులు అడుగుతున్నట్లు రోగి బంధువులు చెప్పడంతో ఆయన మండిపడ్డారు. మీకెప్పుడైనా ఈ సమస్య ఎదురైందా?


