News February 17, 2025

MDCL: ఇంటర్ పరీక్షలు రాసేవారు.. వీరే..!

image

మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ఇయర్ 64,107 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ 62,316 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఇప్పటికే జిల్లా విద్యాశాఖ యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లుగా పేర్కొంది. విద్యార్థులందరూ ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలకు ప్రిపేర్ కావాలని సూచించింది.

Similar News

News March 7, 2026

కామారెడ్డి: జర జాగ్రత్త..!

image

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో భిక్కనూరు, మేనూరు, సోమూరు 38.2°C, కొల్లూరు, సదాశివనగర్ 38.1, ఎల్పుగొండ, బీర్కూర్ 38, సర్వాపూర్ 37.8, డోంగ్లి, బీబీపేట 37.7, పుల్కల్, పిట్లం 37.3, మాచాపూర్, గాంధారి, నాగిరెడ్డిపేట 37.2, దోమకొండ 37.1, కామారెడ్డి 37, బిచ్కుంద 36.7, లింగంపేట, లచ్చపేట 36.6, జుక్కల్ 36.5°C ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 7, 2026

పెద్దపల్లి: IAS కోసం పోరాటం.. ఐదో ప్రయత్నంలో సొంతం!

image

పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది పెద్దపల్లి జిల్లాకు చెందిన గూడెల్లి సృజన. చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలనే కల కన్న ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని సివిల్స్ బాట పట్టింది. నాలుగుసార్లు వైఫల్యం ఎదురైనా వెనకడుగు వేయలేదు. గతేడాది గ్రూప్-1లో 35వ ర్యాంక్ సాధించి ప్రస్తుతం డీఎస్పీగా శిక్షణ పొందుతూనే తన ఐదో ప్రయత్నంలో ఆలిండియా 55వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ కలను సాకారం చేసుకున్నారు.

News March 7, 2026

నల్గొండ: సివిల్స్‌లో సత్తా చాటిన బ్రదర్స్

image

చిట్యాల మండలం సుంకెనపల్లికి చెందిన అన్నదమ్ములు విక్రమసింహారెడ్డి, విజయసింహారెడ్డి సివిల్స్‌లో సత్తా చాటారు. ఫలితాల్లో విక్రమసింహారెడ్డి 541వ ర్యాంకు, విజయసింహారెడ్డి 682వ ర్యాంకు సాధించారు. వీరి తండ్రి అంజిరెడ్డి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి కాగా, తల్లి అలివేలు గృహిణి. ప్రస్తుతం వీరు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎంపీడీవోలుగా పనిచేస్తూనే ఈ ఘనత సాధించడం విశేషం.