News February 10, 2025
MDCL: త్వరలో ఎన్నికలు.. ZP ఛైర్మన్ సీటుపై కన్ను..!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జడ్పీ ఛైర్మన్ సీటుపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు కన్నేశారు. త్వరలోనే ZPTC, MPTC ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీటు దక్కించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 3-ZPTC, 19- MPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వనుంది. గతంలో 61 గ్రామాలు కలిగిన మేడ్చల్ జిల్లాలో 28 పంచాయతీల విలీనం అనంతరం ఆ సంఖ్య 33కు చేరింది.
Similar News
News February 9, 2026
నేటితో క్యాంపెయిన్ బంద్.. హోరెత్తించనున్న హేమాహేమీలు

మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. ఉమ్మడి ఖమ్మంలో ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ తరఫున మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి రోడ్‌షోల్లో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ తరఫున పువ్వాడ, నామా, వద్దిరాజు ఓట్లు అభ్యర్థించనున్నారు. వామపక్ష నేతలు కూడా తమ అభ్యర్థుల కోసం విస్తృతంగా పర్యటించనున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.
News February 9, 2026
భూపాలపల్లి: చిన్నారిపై ఇద్దరు యువకుల లైంగిక దాడి! UPDATE

BHPL జిల్లాలో 8ఏళ్ల <<19087811>>చిన్నారిపై లైంగిక దాడి<<>> జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. రేగొండ(M)లోని ఓ గ్రామానికి చెందిన చిన్నారి ఇంటివద్ద ఆడుకుంటుండగా రెండ్రోజుల క్రితం ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే విషయాన్ని సోదరుడైన మరో యువకుడికి చెప్పడంతో అతను సైతం లైంగిక దాడికి చేశాడు. అస్వస్థతకు గురైన బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. నిందితులపై పోక్సో కేసు నమోదైంది.
News February 9, 2026
గుంటూరు: యువతి అదిరిపోయే స్కెచ్.. రూ.60 లక్షలు గోవిందా.!

ఆన్‌లైన్ మోసగాళ్ల వలలో పడి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భారీగా నష్టపోయారు. పాతగుంటూరుకు చెందిన శ్రీనివాసరావుకు ఓ యువతి పరిచయమై, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ ఆశ చూపింది. ఆమె మాటలు నమ్మి విడతలవారీగా రూ.60 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత యువతి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


