News May 7, 2025
MDCL: రూ.500లతో 6 దేవాలయ దర్శనం

MDCL ఆర్టీసీ అధికారులు బెస్ట్ టెంపుల్ టూర్ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. కేవలం పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.300 ఛార్జితో ఏకంగా బద్రీనాథ్ టెంపుల్, వర్గల్ జ్ఞాన సరస్వతి టెంపుల్, కొమరవెల్లి మల్లన్న, అలియాబాద్ వెంకటేశ్వర స్వామి, చీర్యాల లక్ష్మీనరసింహస్వామి, భువనగిరి స్వర్ణగిరి దేవాలయాలు దర్శించుకోవచ్చని తెలిపారు. ఈ టూర్ బస్ స్పెషల్ మెట్రో ఎక్స్ ప్రెస్ కావడంతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తించదన్నారు.
Similar News
News February 13, 2026
BREAKING: మహబూబాబాద్‌లో హంగ్.. CONGRESS 13, BRS 12

మహబూబాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 36 వార్డులు ఉండగా కాంగ్రెస్ 13, BRS 12, CPI 3, CPM 3, ఇండిపెండెంట్ 4, BJP 1 స్థానంలో గెలిచింది. కాగా మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 19 ఏ పార్టీ సాధించకపోవడంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. దీంతో మహబూబాబాద్‌లో ఏం జరుగుతుందోనని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
News February 13, 2026
కామారెడ్డి: పరాజయం పాలైన కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 31వ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి రవి ప్రసాద్ ఘోర పరాజయం పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి అజీజ్ హుస్సేన్, ఇండిపెండెంట్ అభ్యర్థి సత్య ప్రకాశ్‌పై గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పాక జ్ఞానేశ్వరి మూడో స్థానంలో నిలిచారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహంలో ఉన్నారు.



