News April 24, 2025
MDCL: వారం- పది రోజుల్లో రిజల్ట్..!

MDCL మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ITI కాలేజీల విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు రెండో రోజు ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. నేటి నుంచి వారం నుంచి పది రోజుల్లో సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు మేడ్చల్ ITI అధ్యాపక బృందం తెలిపింది. మే మొదటి వారం లోపలే ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.
Similar News
News March 10, 2026
విశాఖలో కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై కేసులు

విశాఖలో 10 రోజులుగా రవాణా శాఖ అధికారులు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై 8 కేసులు నమోదు చేసినట్టు ఉప రవాణా కమిషనర్ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించి అనుమతులు లేకుండా నడపడం, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించడం, పన్నులు చెల్లించకపోవడం వంటివి గుర్తించారు. నిబంధనలు ఉల్లంగించిన 8 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.6,35,000 చలానా విధించారు.
News March 10, 2026
విజయనగరం కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17వ తేదీతో ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం ముగియనుంది. నగరపాలక సంస్థలో తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు కలెక్టర్ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తారు. నగరంలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ, కీలక నిర్ణయాల బాధ్యత ఇకపై కలెక్టర్ నేతృత్వంలోనే కొనసాగనుంది.
News March 10, 2026
విశాఖలో సరికొత్త పర్యాటక హంగులు

విశాఖలో అడ్వెంచర్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు VMRDA కీలక అడుగు వేసింది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో అత్యాధునిక ‘రోప్‌వే’ & ‘లూజ్ గ్రావిటీ రైడ్’ అభివృద్ధికి టెండర్లు (RFP) ఆహ్వానించింది. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించే ఈ ప్రాజెక్టు విశాఖ పర్యాటక రంగానికి మరింత ఊపునివ్వనుంది. దీని ద్వారా విదేశీ తరహా వినోద క్రీడలు ఇకపై మన నగరంలోనే అందుబాటులోకి రానున్నాయి.


