News December 2, 2025

MDK: అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిషేధం: ఎస్పీ

image

శాంతిభద్రతల పరిరక్షణకు డిసెంబర్ 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలు ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు, రాస్తారోకోలు నిషేధమని, చట్టవ్యతిరేక, అశాంతి సృష్టించే చర్యలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు పోలీసుల చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News February 13, 2026

మెదక్ జిల్లాలో కౌంటింగ్ ప్రశాంతం: కలెక్టర్

image

మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటించారు. మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్‌తో కలిసి కౌంటింగ్‌ను పర్యవేక్షించారు. సమన్వయంతో పనిచేసిన అధికారులను, సిబ్బందిని అభినందించారు.

News February 13, 2026

తూప్రాన్: సమంగా ఓట్లు.. డ్రా

image

తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ మరో విజయం నమోదైంది. మున్సిపాలిటీలోని 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సత్య లింగం, స్వతంత్ర అభ్యర్థి కృష్ణ పై గెలుపొందారు. ఇరువురికి సమంగా 330 ఓట్లు రాగా, డ్రా నిర్వహించారు. డ్రాలో సత్య లింగం గెలుపొందారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. లెక్కింపు కేంద్రం వద్ద గులాబీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు.

News February 13, 2026

మెదక్: ఒక్క ఓటుతో గెలుపు

image

మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన కే.హరిత కేవలం ఒక ఓటుతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రావుపై విజయం సాధించారు. ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.