News August 2, 2024
MDK: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట మోసం

గుర్తు తెలియని యాప్‌లో ట్రేడింగ్ చేసి ఓవ్యక్తి రూ.లక్షలు పోగొట్టుకున్న ఘటన తూప్రాన్‌లో జరిగింది. SI శివానందం ప్రకారం.. పట్టణంలో వ్యాపారం చేసే ఓవ్యక్తి ఇన్‌స్టాలో వచ్చిన లింక్‌తో ఓ వాట్సాప్ గ్రూపులో యాడై IIFL అనే యాప్ డౌన్లోడ్ చేశాడు. పలు దఫాలుగా అందులో రూ.15లక్షల వరకు ట్రేడింగ్ చేయగా.. రూ.95లక్షలు ప్రాఫిట్ వచ్చింది. అయితే డబ్బు విత్ కాకపోవడంతో మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Similar News
News December 14, 2025
MDK: 2 ఓట్లతో స్వప్న విజయం

నిజాంపేట మండలం నందిగామలో బీజేపీ మద్దతుదారు షేరి స్వప్న 2 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. గ్రామంలో వారి మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుపోతామని వారు పేర్కొన్నారు. నమ్మకంతో గెలిపించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
News December 14, 2025
MDK: 4 ఓట్లతో కనకరాజు విజయం

నిజాంపేట మండల పరిధిలోని రజాక్ పల్లిలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి సునీతపై బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వోజ్జ కనకరాజు 4 ఓట్లతో విజయం సాధించాడు. మండలంలో బీఆర్ఎస్ మొదటి విజయంతో ఖాతా ఓపెన్ చేయడం విశేషం. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడంతో గ్రామంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని అభ్యర్థి తెలిపారు.
News December 14, 2025
మెదక్ జిల్లాలో రెండో విడతలో 88.80% పోలింగ్

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. చేగుంట, మనోరాబాద్, మెదక్, నార్సింగి, నిజాంపేట్, రామాయంపేట, శంకరంపేట (ఆర్), తూప్రాన్ మండలాల్లో పోలింగ్ నిర్వహించగా 88.80 శాతం నమోదైంది. మొత్తం 1,72,656 ఓటర్లలో 1,53,313 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి.


