News October 6, 2025
MDK: ఎన్నికలు.. అటు ఇటు దూకుతూ..!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో ఆయా పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి. మండల, నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు పార్టీలు మారుతున్నారు. ఈ వ్యవహారంలో BRS, కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. కౌడిపల్లి(M)కి చెందిన 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సునీతారెడ్డి సమక్షంలో BRSలో చేరారు. పెద్దశంకరంపేట BRS మండల అధ్యక్షుడు మురళి ఇటీవల ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Similar News
News January 20, 2026
‘ఎంపిక చేసిన గ్రామాల్లో రీ సర్వేకు సిద్ధం కావాలి’

రాష్ట్రంలో ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాల్లో భూ రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సిసిఎల్ఎ కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లైసెన్డ్ సర్వేయర్లను కేటాయించి, రెండో గెజిట్ నోటిఫికేషన్ తర్వాత శాస్త్రీయంగా సర్వే చేపట్టాలని సూచించారు. భూభారతి కింద చేపట్టే ఈసర్వేకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
News January 20, 2026
కాజీపేట: పెన్షనర్ల సమస్యలపై అండగా ఉంటా: ఎమ్మెల్యే

కాజీపేట రైల్వే సంఘ్ కార్యాలయంలో జరిగిన పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్సవానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, సంఘం డైరీని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెన్షనర్ల భవన ఏర్పాటుకు కలెక్టర్‌తో మాట్లాడి స్థల కేటాయింపు చేయిస్తానని, విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
News January 20, 2026
వేములవాడలో 22న వాహనాల వేలం

వేములవాడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో ఈనెల 22వ తేదీన ద్విచక్ర వాహనాల వేలం నిర్వహించనున్నట్లు సీఐ రాజశేఖర్ రావు తెలిపారు. వివిధ కేసుల్లో పట్టుబడి, సీజ్ చేసిన వాహనాలకు బహిరంగ వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తి గలవారు వేలం పాటలో పాల్గొనవచ్చని, నిర్ణీత వాహన రుసుముపై 50 శాతం ఈఎండీ (ధరావతు) ముందుగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.


