News December 3, 2025
MDK: ఎవరికి వారే.. ఏకాభిప్రాయ సాధనకు బుజ్జగింపులు

పంచాయతీ ఎన్నికలు పార్టీలకు చుక్కలు చూపిస్తున్నాయి. పార్టీ మద్దతుదారులు ఎవరికి వారే బరిలో దిగడంతో ఏకాభిప్రాయం కోసం నేతలు తంటాలు పడుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌లో విపరీతమైన పోటీ నెలకొనడంతో సర్దుబాటు చేయలేక పార్టీ నాయకులు తలలు పట్టుకున్నట్టు తెలుస్తుంది. మెదక్ జిల్లాలో 492 జీపీలు, సంగారెడ్డిలో 613 జీపీలు, సిద్దిపేట జిల్లాలోని 508 జీపీలతో పాటు వార్డులకు 11,14,17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News February 13, 2026
సంగారెడ్డి: మైనర్ బాలికపై రేప్.. 20 ఏళ్ల శిక్ష

సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలానికి చెందిన వడ్డే రాజు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సంగారెడ్డి స్పెషల్ పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నేరం నిరూపితం కావడంతో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ జడ్జి కె.జయంతి తీర్పు చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులను ఎస్పీ పారితోష్ పంకజ్ ప్రత్యేకంగా అభినందించారు.
News February 13, 2026
విశాఖలో సహజీవనం.. ప్రియుడిని చంపిన ప్రియురాలు

ఆనందపురం శివారు పందుల ఫారంలో జరిగిన <<19116438>>హత్య<<>> కేసులో నిందితురాలు షేక్ ముబీనా అలియాస్ శ్రావణి (41)కి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజమహేంద్రవరానికి చెందిన నాగశివ (36)తో ఆమె సహజీవనం సాగిస్తోంది. ఆవు అమ్మకం డబ్బుల విషయంలో గొడవ, వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో అతడిపై కత్తితో దాడి చేయగా మృతి చెందాడు. జాగిలాల సాయంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.
News February 13, 2026
కల్వకుర్తి: తాగిన మైకంలో ఆరేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు

కల్వకుర్తి పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో దారుణం జరిగింది. మద్యం మత్తులో రాజు అనే వ్యక్తి ఆరేళ్ల బాలికను ఇంటిపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


