News December 3, 2025

MDK: ఎవరికి వారే.. ఏకాభిప్రాయ సాధనకు బుజ్జగింపులు

image

పంచాయతీ ఎన్నికలు పార్టీలకు చుక్కలు చూపిస్తున్నాయి. పార్టీ మద్దతుదారులు ఎవరికి వారే బరిలో దిగడంతో ఏకాభిప్రాయం కోసం నేతలు తంటాలు పడుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌లో విపరీతమైన పోటీ నెలకొనడంతో సర్దుబాటు చేయలేక పార్టీ నాయకులు తలలు పట్టుకున్నట్టు తెలుస్తుంది. మెదక్ జిల్లాలో 492 జీపీలు, సంగారెడ్డిలో 613 జీపీలు, సిద్దిపేట జిల్లాలోని 508 జీపీలతో పాటు వార్డులకు 11,14,17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News February 13, 2026

చిత్తూరు: నీటి ఎద్దడి సమరం..అధికార యంత్రాంగం సన్నద్ధమా?

image

వేసవి ప్రారంభం కాకముందు ఎండలు మండుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం సగటు భూగర్భ నీటి మట్టం 8.04 మీటర్లు ఉండగా, గతేడాది 8.94 మీటర్లు ఉండేది. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో, పలమనేరు, బైరెడ్డి మండలాల్లోని అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. నీటి ఎద్దడి తీవ్రంగా ఎదుర్కొనే ప్రాంతాలపై RWS అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

News February 13, 2026

నల్గొండలో విషాదం.. డీసీఎం ఢీకొని కానిస్టేబుల్‌ మృతి

image

చందనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చందనపల్లి సమీపంలో వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్, ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో మునుగోడు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షేక్ తయ్యుబ్ (34) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ​ఎన్నికల విధులను ముగించుకుని నకిరేకల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుడికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నట్లు సమాచారం. ప్రమాద ధాటికి బైక్ నుజ్జునుజ్జయింది.

News February 13, 2026

YCPని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది: పవన్ ఎద్దేవా

image

AP: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నేతలు వెల్‌లోకి దూసుకొచ్చి రభస చేయడంపై Dy.CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాగితాలు చించి విసరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసెంబ్లీలో 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయిన YCPని చూసి ఏం చేయకూడదో, ఏం చేయాలో వంటి చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉందని ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు.