News December 1, 2025

MDK: దేవుడా నీవే దిక్కు.. గెలిస్తే లక్కు!

image

ఉమ్మడి MDK జిల్లాలో రెండో విడత జీపీ ఎన్నికల్లో 1వ రోజు సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు అంతంతా మాత్రమే దాఖలు చేశారు. దీంతో DEC 1న ఏకాదశి ఉండడంతో ఇష్ట దైవాన్ని ప్రార్థించి నామినేషన్ వేస్తే అన్ని శుభాలే కలుగుతాయిని అభ్యర్థులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో సోమవారం భారీగా నామినేషన్లు వచ్చే ఆస్కారం ఉందని అధికారులు చెప్తున్నారు. చూడాలి ఎంత మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారో.!

Similar News

News February 13, 2026

మెదక్: ఒక్క ఓటుతో గెలుపు

image

మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన కే.హరిత కేవలం ఒక ఓటుతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రావుపై విజయం సాధించారు. ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

News February 13, 2026

రాయికల్‌లో ‘కమలం’ జోరు

image

జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 12 వార్డులకు గాను బీజేపీ 5 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో 3 వార్డుల్లో జయకేతనం ఎగురవేయగా, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు ‘స్వతంత్ర’ అభ్యర్థి మద్దతు కీలకం కానుంది.

News February 13, 2026

రామగుండంలో కాంగ్రెస్‌ జోరు.. 34 స్థానాల్లో ఆధిక్యం!

image

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. మొత్తం 60 డివిజన్లలో కాంగ్రెస్ 34 స్థానాల్లో ముందంజలో ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, ఫలితాల సరళిని బట్టి పార్టీ శ్రేణులు ఇప్పటికే సంబరాలు మొదలుపెట్టాయి.