News August 14, 2025

MDK: నేడు పాఠశాలలకు సెలవు

image

గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర పాఠశాలలకు నేడు (ఆగస్టు 14) సెలవును ప్రకటించారు. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు తక్షణం సెలవు ప్రకటించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News March 11, 2026

పాలకవర్గ గడువు ముగియకముందే స్టాండింగ్ కమిటీ సమావేశం

image

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఈనెల 13న నిర్వహించనున్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అజెండా సిద్ధం చేసి సభ్యులకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి సమావేశం. గతంలో పెండింగ్‌లో ఉన్న కొన్ని అంశాలు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

News March 11, 2026

సూర్యాపేట: కొత్త పింఛన్లు ఇంకెప్పుడు..!

image

సూర్యాపేట జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోవడంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం 20 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా పింఛన్ల పెంపుపై స్పష్టత లేదు. పాత పింఛన్లు ఆగిపోతున్నాయే తప్ప, అర్హులైన కొత్తవారికి మాత్రం ఊరట లభించడం లేదు. పేదలు, దివ్యాంగులు ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

News March 11, 2026

TG గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణం

image

నేడు 11.30 గంటలకు HYDలోని లోక్ భవన్‌లో తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీఎస్, మంత్రులు తదితరులు హాజరవుతారు.