News October 5, 2025
MDK: భూగర్భ జలాలు ఉప్పొం’గంగ’

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలో అంతంత మాత్రమే కురిసిన వర్షాలు గత సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో కురవడంతో చాలా ఏళ్ల తర్వాత భూగర్భ జలమట్టాలు ఉబికి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో 3.29 మీటర్లు, MDKలో 2.95, SDPTలో 2.11 మీటర్ల చొప్పున జల మట్టాలు పెరిగాయని భూగర్భ జల వనరుల శాఖ తాజా పరిశీలనలో తేలింది.
Similar News
News January 18, 2026
HYDలో విమానాల న్యూమాయిష్.. ఎక్కడంటే..?

నగరం మరో ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఈనెల 28 నుంచి నాలుగు రోజుల పాటు విమానాల ప్రదర్శన నిర్వహించనున్నారు. వింగ్స్ ఇండియా పేరిట నిర్వహించే ఈ ఎగ్జిబిషన్లో ప్రముఖ కంపెనీలు తమ విమానాలను ప్రదర్శననున్నాయి. మొదటి రెండు రోజులు బిజినెస్ పీపుల్‌కు, తరువాతి రెండు రోజులు సిటీ ప్రజలకు విమానాలను చూసే అవకాశం ఇవ్వనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఈ విమానాల ఎగ్జిబిషన్ ఉంటుంది.
News January 18, 2026
శ్రీశైలంలో నేటితో ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో నేటి ఆదివారం తో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. సాయంత్రం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లు అశ్వవాహన సేవలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ జరిపిస్తారు. ఆయా ఉత్సవాలతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
News January 18, 2026
మహానగరానికి లక్కీ డ్రా.. ఎప్పుడు తీస్తారో..?

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వార్డుల రిజర్వేషన్లను నిన్న రాష్ట్ర వ్యాప్తంగా లక్కీ డ్రా తీసి ఖరారు చేయగా మహానగరంలో మాత్రం అది జరగలేదు. పునర్విభజన తరువాత 300 డివిజన్లు ఏర్పాటయ్యాయి. వీటికి ప్రస్తుత కౌన్సిల్ గడువు (ఫిబ్రవరి 10 తరువాత) ముగిసిన తరువాత తీయాలా? లేక మూడు కార్పొరేషన్లుగా విభజించిన తరువాత తీయాలా? అని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ డ్రా ప్రక్రియను నిన్న నిర్వహించలేదు.


