News November 8, 2025

MDK: రేవంత్‌కు ఓటమి భయం.. పథకాలు ఆయన జాగీరా?: హరీశ్ రావు

image

కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తామని రేవంత్‌ రెడ్డి అనడంపై హరీశ్ రావు మండిపడ్డారు. పథకాలు ఆపడానికి ఇది రేవంత్‌ రెడ్డి అయ్య జాగీరా అని ప్రశ్నించారు. అది ప్రజల సొమ్ము అని, ప్రజలకు ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత అని స్పష్టం చేశారు. ఓటమి భయం వల్లే రేవంత్‌ రెడ్డి ప్రజలను భయపెడుతున్నారని హరీశ్‌ రావు విమర్శించారు. హైదరాబాద్‌లోని ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Similar News

News January 21, 2026

మనుబోలు: రైలు పట్టాల సమీపంలో శవం

image

మనుబోలు మండలం కొమ్మలపూడి, వెంకటాచలం రైల్వే స్టేషన్ల మధ్య 157/08_10 వద్ద పట్టాల సమీపంలో ఓ మృతదేహాన్ని రైల్వే పోలీసులు బుధవారం గుర్తించారు. సహజంగా మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. బ్రౌన్ కలర్ ఫుల్ హాండ్స్ స్వెటర్, ఎరుపు, తెలుపు గీతల చొక్కా, పాచి కలర్ టీషర్ట్, స్కై బ్లూ బనియన్, నలుపు రంగు జీన్స్ ధరించి ఉన్నాడని రైల్వే ఎస్ఐ హరిచందన తెలిపారు.

News January 21, 2026

నాకు ఆ చిన్న ఐస్ ముక్క చాలు.. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్

image

దావోస్‌ వేదికగా నాటో దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ‘నేను కేవలం ఒక ఐస్ ముక్క మాత్రమే అడుగుతున్నాను. ఇందుకు నో అనేవారిని అస్సలు మర్చిపోను’ అని హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడానికి ఫోర్స్‌ను కూడా ఉపయోగించనంటూ పరోక్ష బెదిరింపులకు దిగారు. ఆ ప్రాంతాన్ని కాపాడడం తమకే సాధ్యమని, ఇంకెవరూ ఆ పని చేయలేరని చెప్పుకొచ్చారు.

News January 21, 2026

ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యం: భద్రాద్రి కలెక్టర్

image

ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్ఠాత్మక జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జల్ శక్తి అంకల్ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ఛాంబర్‌లో జిల్లా స్థాయి తాగునీటి సరఫరా పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.