News August 11, 2025

MDK: వర్షాభావ పరిస్థితులు.. సాగు కాని పంటలు

image

ఉమ్మడి జిల్లాలో రైతులను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. సరైన వానలు కురువకపోవడంతో పూర్తిస్థాయిలో పంటలు సాగు చేయలేకపోతున్నారు. MDK జిల్లాలో 3,50,164 ఎకరాలు సాగు అవుతాయని అంచనా వేసినా 2,36,255 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. SDPTలో 5,60 లక్షల ఎకరాలకు పైగా సాగులోకి వస్తాయని అంచనా వేసిన 3,60 లక్షల ఎకరాలలోపే సాగులోకి వచ్చాయి. సరైన వానలు పడక వేసిన పంటలకు నీటి తడులు అందని పరిస్థితి నెలకొంది.

Similar News

News March 10, 2026

BREAKING: 13న అకౌంట్లలో డబ్బులు జమ

image

రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం నిధుల విడుదల డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 13న 22వ విడత డబ్బులు జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఈ డబ్బులు రిలీజ్ చేస్తారు. కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. దీని ద్వారా సుమారు 10 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు.

News March 10, 2026

ప్రజలపై భారం.. మీ విద్యుత్ కొనం: NTPCకి రాష్ట్రం లేఖ

image

TG: బయట చౌకగా దొరుకుతున్నా ఒప్పందం పేరిట ఎక్కువ ధర ఉన్న NTPC విద్యుత్తును కొనేది లేదని రాష్ట్రం ఆ సంస్థకు లేఖ రాసింది. తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తు చేసింది. అటు సంస్థ నిర్మిస్తున్న 2400MW ప్రాజెక్టుకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయలేమని తేల్చి చెప్పింది. నిల్వలు ఉంటే సరఫరాపై పరిశీలిస్తామంది. ప్రజలపై భారం పడకుండా తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వాలని స్పష్టం చేసింది.

News March 10, 2026

పెద్దపల్లి: ఈనెల 13న జాబ్ మేళా

image

పెద్దపల్లి జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు ఈనెల 13న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారి వై.తిరుపతిరావు తెలిపారు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌లో మూడు నెలల శిక్షణ అనంతరం ఉపాధి కల్పిస్తారని పేర్కొన్నారు. డిప్లొమా, బీటెక్ అర్హత కలిగి 18–28 ఏళ్ల మధ్య ఉన్నవారు నూతన కలెక్టరేట్ భవనం, రూమ్ నం.233లో ఉదయం 11 గంటలకు తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు.