News April 25, 2024
MDK: వెంకట్రామిరెడ్డి ఆస్తులు, అప్పులు ఇవే.. !

BRS పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తన పేరిట రూ. 62,84,43,006 ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. అందులో 3 కిలోల పైగా బంగారం, రెండు కిలోల పైగా వెండి ఆభరణాలు ఉన్నాయి. ఇందుర్తిలో రూ. 7.88 లక్షల విలువైన 1.30 ఎకరాల భూమి, ప్లాట్లు ఉన్నాయి. ప్రణీత రెడ్డి పేరిట రూ. 4.48 కోట్ల విలువైన రాజ్‌పుష్ప ఫామ్స్, 3.33 కిలోల బంగారం, 2 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి.
Similar News
News April 19, 2026
మెదక్: ఇంటికి చేరాలి.. షార్ట్ ఫిల్మ్‌ను ప్రారంభించిన ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కోసం రూపొందించిన “ఇంటికి చేరాలి…” అనే షార్ట్ ఫిల్మ్‌ను ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. 99 రోజుల ప్రజా ప్రణాళిక “సురక్షిత ప్రయాణం” కార్యక్రమంలో భాగంగా రూపొందిన ఈ చిత్రం యువతలో మార్పు తీసుకురావడమే లక్ష్యంమని, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, జరిమానాలు, శిక్ష కోసం కాకుండా ప్రాణ రక్షణ కోసం అనే సందేశాన్ని అందిస్తోందని తెలిపారు.
News April 19, 2026
మెదక్: ఏప్రిల్ 20 నుంచి సంక్షేమ వారం: కలెక్టర్

ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 26 వరకు 7 రోజుల సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సీఎస్ రామకృష్ణారావు సూచించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, మరమ్మతులు చేపట్టాలన్నారు. విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం వంటి పోటీలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు జరిపించాలన్నారు.