News December 3, 2025
MDK: సర్పంచ్, వార్డు అభ్యర్థుల గుర్తులు ఎలా కేటాయిస్తారో తెలుసా..?

గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ చేసుకోవచ్చు. గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉన్న వారికి గుర్తుల కేటాయింపు ప్రారంభమవుతుంది. అయితే ఈసారి గుర్తుల కేటాయింపు తెలుగు అక్షర క్రమానుసారం జరుగుతుంది. నామినేషన్ పత్రంలో అభ్యర్థి పేరు ఎలా నమోదు అయిందో, ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే గుర్తులను కేటాయిస్తారు.
Similar News
News February 13, 2026
మేడ్చల్: పురపోరులో ఎగిసిన ‘యువ’ కెరటాలు

ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఐదుగురు యువ కౌన్సిలర్లు గెలుపొందారు. 7వ వార్డు నుంచి బందేల కుమార్, 8వ వార్డు లావుడ్య శ్రీదేవి, 11వ వార్డు గోషిక అఖిల, 18వ వార్డు ఓం ప్రకాశ్ గౌడ్, 10వ వార్డు నిరుగంటి శ్రీలత గెలుపొందారు. 24 మంది కౌన్సిలర్ అభ్యర్థులలో ఐదుగురు యువ నాయకులు ప్రజాప్రతినిధులుగా గెలుపొందడం మేడ్చల్ మండల చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ ఐదుగురు BRS పార్టీ నిలబెట్టినవారే.
News February 13, 2026
కానిస్టేబుల్ సస్పెండ్.. గెలిచిన భార్య!

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణలతో సస్పెండైన కానిస్టేబుల్ భార్య గెలిచారు. సిద్దిపేట(D) చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డులో BRS తరఫున గీతాంజలి పోటీ చేశారు. ఆమె భర్త రమేశ్ కొమురవెళ్లి PSలో కానిస్టేబుల్. ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు వెళ్లడంతో విధుల నుంచి రమేశ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో గీతాంజలి కాంగ్రెస్ అభ్యర్థి ముస్త్యాల తేజపై 223 ఓట్ల తేడాతో గెలిచారు.
News February 13, 2026
తొర్రూర్: 9 వార్డులో మొత్తం 1282 ఓట్లు.. బీఎస్పీకి ఒక్క ఓటు రాలే!

తొర్రూర్ మున్సిపాలిటీలోని 9వ వార్డులో అత్యంత ఉత్కంఠ పోరు నెలకొంది. 9వ వార్డు SC-W రిజర్వ్డ్ అయింది. అయితే, బరిలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి కిన్నెర కవిత 451 ఓట్లు సాధించి, కేవలం 13 ఓట్ల స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన(438 ఓట్లు)పై విజయం సాధించారు. ఈ వార్డులో మొత్తం 1282 ఓటర్లు ఉండగా.. 901 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 12 ఓట్లు రాగా.. బీఎస్పీకి ఒక్క ఓటు కూడా రాకపోవడం గమనార్హం.


