News September 12, 2025
MDK: స్థానిక ఎన్నికలు.. మహిళలే కీలకం!

ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించగా మహిళా ఓటర్లే అధికంగా ఉండడంతో వారిచ్చే తీర్పు స్థానిక ఎన్నికల్లో కీలకం కానుంది. MDK జిల్లాలో మొత్తం 5,23,327 ఓటర్లు ఉండగా అందులో పురుష ఓటర్ల కంటే 20,255 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. SDPTలో 6,55,958 ఓటర్లు ఉండగా పురుషులు 3,21,766, మహిళలు 3,34,186 మంది ఉన్నారు. SRDలో 7,44,297 ఓటర్లు ఉండగా అందులో మహిళలే ఎక్కువగా ఉన్నారు.
Similar News
News December 13, 2025
సంగారెడ్డి: ఓటేయడానికి ఇవీ తీసుకెళ్లండి !

ఓటర్లు తమ గుర్తింపుకు EPIC కార్డు (ఓటర్ ఐడీ) లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిన ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదో ఒకదాన్ని చూపించవచ్చు. ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఫొటోతో కూడిన బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్బుక్, రేషన్ కార్డు, పట్టాదారు పాస్బుక్, ఉపాధి జాబ్ కార్డు, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం, పెన్షన్ పత్రాలు తదితరాలు చెల్లుబాటు అవుతాయి.
News December 13, 2025
పేరు మార్పుతో ప్రయోజనం ఏంటి: ప్రియాంకా గాంధీ

ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును ‘పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం’గా మార్చాలన్న <<18543899>>కేంద్ర నిర్ణయం<<>>పై కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వలన ఏ ప్రయోజనం ఉంటుందో అర్థం కావడం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీసులతో పాటు పత్రాలలో పేరు మార్చాల్సి రావడం వల్ల ప్రభుత్వానికి భారీగా ఖర్చవుతుందని పేర్కొన్నారు. అనవసర వ్యయంతో ప్రజలకు లాభం ఏమిటని ప్రశ్నించారు.
News December 13, 2025
గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరపాలి: కలెక్టర్

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆమె మాడుగులపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కౌంటింగ్ సమయానికి ప్రారంభించి, ఎటువంటి జాప్యం లేకుండా ఫలితాలను వెల్లడించాలని అధికారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.


