News April 1, 2024
MDK, ZHB కాంగ్రెస్ ఇంఛార్జులుగా మంత్రులు రాజనర్సింహ, సురేఖ

మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జులను నియమించింది. మెదక్ లోక్ సభ నియోజకవర్గానికి మంత్రి కొండ సురేఖ, జహీరాబాద్ నియోజకవర్గానికి మంత్రి దామోదర రాజనర్సింహను ఇంఛార్జీగా, ఏఐసీసీ ఇంఛార్జీగా పీసీ విశ్వనాథ్‌ను నియమించారు. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News February 14, 2026
మెదక్: రేపు 11లోపు Form-A సమర్పించాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ అధికార ప్రతినిధిత్వానికి సంబంధించి Form-Aని రేపు ఉ.11 గంటలలోగా సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. అలాగే Form-Bని ఎన్నిక రోజు ఉ.10 గంటల వరకు అందజేయాలని సూచించారు. గడువులోపు మార్పులకు అవకాశం ఉంటుందని, ఎన్నికల సమావేశం చెల్లుబాటు కావాలంటే కనీసం 50 శాతం సభ్యుల హాజరు తప్పనిసరని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన కోరారు.
News February 14, 2026
మెదక్: ఏడుపాయల జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు

మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు జరిగే ఏడుపాయల వనదుర్గ మాత జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాతర ప్రాంగణాన్ని సిసి కెమెరాల నిఘాలో ఉంచామన్నారు. భద్రత కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భక్తులు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
News February 14, 2026
రామాయంపేటలో అధికార పార్టీకే పట్టం

రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి అధికార పార్టీకి జై కొట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తొలి ఎన్నికల్లో 8 స్థానాలను ఆ పార్టీకి అందించిన ఓటర్లు, నేడు జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే రీతిన కాంగ్రెస్ పార్టీకి 8 కౌన్సిలర్ స్థానాలను కట్టబెట్టారు. అధికార పార్టీతోనే పట్టణాభివృద్ధి సాధ్యమని ఆకాంక్షిస్తూ ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


