News December 28, 2024
మెగా డీఎస్సీ ఆలస్యం.. నిరుద్యోగుల అసంతృప్తి
AP: 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పలుమార్లు వాయిదా పడటంతో నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. జూన్ నాటికి పోస్టులు భర్తీచేస్తామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవంలో సాధ్యం అవుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణపై నివేదికకు 3 నెలల గడువు ఉంది. ఆ తర్వాత డీఎస్సీ నిర్వహణకు కనీసం 3-4 నెలలు పట్టే అవకాశం ఉంది. కొత్త టీచర్లకు శిక్షణ, పోస్టింగ్ మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది.
Similar News
News January 26, 2025
ప్రముఖ కార్డియాక్ సర్జన్ KM.చెరియన్ కన్నుమూత
ప్రముఖ కార్డియాక్ సర్జన్ KM.చెరియన్(82) కన్నుమూశారు. నిన్న బెంగళూరులో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన సాయంత్రం ఉన్నట్టుండి కుప్పకూలారని, ఆస్పత్రిలో చేర్పించగా అర్ధరాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భారత్‌లో తొలి కరోనరీ ఆర్టరీ బైపాస్ శస్త్రచికిత్స, తొలి గుండె-ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీ చేసిన వైద్యుడిగా ఆయన పేరొందారు. పద్మశ్రీ, హార్వర్డ్ మెడికల్ ఎక్స్‌లెన్స్ వంటి అవార్డులు అందుకున్నారు.
News January 26, 2025
ఘనంగా గణతంత్ర వేడుకలు
దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని BJP కేంద్ర కార్యాలయంలో జాతీయాధ్యక్షుడు JP నడ్డా, బెంగళూరులోని INC పార్టీ కార్యాలయం వద్ద AICC అధ్యక్షుడు ఖర్గే త్రివర్ణ పతాకాలు ఆవిష్కరించారు. ముంబైలో MH గవర్నర్ రాధాకృష్ణన్, చెన్నైలో TN గవర్నర్ రవి, భువనేశ్వర్‌లో ఒడిశా గవర్నర్ హరిబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో వేడుకలు జరిగాయి.
News January 26, 2025
RGV డైరెక్షన్‌లో వెంకటేశ్ సినిమా?
ఇక నుంచి తన గౌరవాన్ని పెంచే సినిమాలే తీస్తానన్న RGV ‘సిండికేట్’ అనే మూవీని తీయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇందులో మెయిన్ లీడ్‌గా విక్టరీ వెంకటేశ్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్ లాంటి బిగ్ స్టార్స్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.