News March 27, 2024
సాంకేతిక లోపంతో నిలిచిన మెట్రో

TG: హైదరాబాద్ మెట్రో రైళ్లు కాసేపు నిలిచిపోయాయి. సాంకేతిక లోపంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్లో ఆగాయి. దీంతో 15 నిమిషాల పాటు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకొని రంగంలోకి దిగిన టెక్నికల్ సిబ్బంది సమస్యను పరిష్కరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 19, 2026
ట్రంప్ ఆదేశమే ఆలస్యం.. ఇరాన్‌పై దాడికి US ఆర్మీ సిద్ధం: CNN

ఇరాన్‌పై దాడి చేసేందుకు అమెరికా మిలిటరీ సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ వీకెండ్‌లోనే అటాక్ చేసే ఛాన్స్ ఉందని CNN తెలిపింది. 2003 ఇరాక్ యుద్ధం తర్వాత మిడిల్ ఈస్ట్‌లో US తన అతిపెద్ద ఎయిర్ పవర్‌ను మోహరించినట్లు పేర్కొంది. ట్రంప్ తన అడ్వైజర్లతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్‌గా ఈ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News February 19, 2026
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో 43 పోస్టులు.. అప్లై చేశారా?

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (<
News February 19, 2026
వరి మాగాణి మినుములో ఎండు తెగులు

ఎండు తెగులు ఆశించిన మినుము మొక్కలు వడలి, ఎండి పంటకు నష్టం వాటిల్లుతుంది. భూమిలోని శిలీంధ్రం ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు పంట మార్పిడితో పాటు పొలంలో నీరు నిల్వలేకుండా చూడాలి. పైరు విత్తే ముందు kg విత్తనానికి 3గ్రా. కార్బెండజిమ్ పట్టించి విత్తాలి. ఎకరాకు 80kgల చివికిన పశువుల ఎరువు+20kgల వేపపిండిలో 2kgల ట్రైకోడెర్మావిరిడె జీవశిలీంధ్రాన్ని కలిపి విత్తే సమయంలో భూమిలో కలియదున్నుకోవాలి.


