News November 20, 2025
MHBD: ఆశ్రమ పాఠశాలల సమస్యలపై ఈనెల 24న నిరసన

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం NOV 24న MHBDలో TPTF నిరసన ప్రదర్శన నిర్వహించనుంది. రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, గిరిజన విద్యారంగం తీవ్రంగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, PRC అమలు, వేతనాల సకాలంలో చెల్లింపు వంటి డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Similar News
News January 21, 2026
VJA: మహిళ వేషం ధరించి చోరీ.. నిందితుడి అరెస్ట్

మహిళ వేషం ధరించి బంగారం చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.కండ్రికకు చెందిన ఓ వృద్ధురాలని అదే ప్రాంతానికి చెందిన జోసెఫ్ అనే వ్యక్తి మహిళ వస్త్రాలు ధరించి బంగారం సోమవారం చోరీ చేశాడు. ఈ ఘటనపై సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గంటల వ్యవధిలో అరెస్ట్ చేసినట్లు నున్న సీఐ కృష్ణమోహన్ తెలిపారు. అతని వద్ద నుంచి బంగారం లాకెట్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
News January 21, 2026
జనవరి 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’

AP: పర్యాటక శాఖ JAN 24-FEB 1 వరకు ‘విశాఖ ఉత్సవం’ నిర్వహించనుంది. ‘సీ టు స్కై’ కాన్సెప్ట్‌తో విశాఖ, అనకాపల్లి, అరకు లోయలో 9 రోజులపాటు ఉత్సవం జరగనుంది. విశాఖలో JAN 24-31 వరకు, JAN 29, 30 అనకాపల్లిలో, JAN 30-FEB 1 వరకు అరకు లోయలో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనిలో 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 3000 మందికి ప్రత్యక్ష, 1800 మంది సహాయకులకు ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు.
News January 21, 2026
పల్నాడు: ‘రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలి’

పల్నాడు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భూపరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, భూ సర్వేలు, ప్రభుత్వ ప్రాధాన్యత పనులు సకాలంలో పూర్తిచేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ సేవలు సమర్థంగా అందించాలని పేర్కొన్నారు.


