News April 23, 2025

MHBD: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన మోడల్ కాలేజీ విద్యార్థులు

image

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా మోడల్ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో బి.సాయి సుష్మ 462/470(ఎంపీసీ), జె.మధుమిత 426/440(బైపీసీ), ఏ.శ్రీలక్ష్మి 447/500( సీఈసీ), కే.అనిల్ 839/1000(ఎంపీసీ), కె.మహేశ్వరి 952/1000(బైపీసీ), ఈ.సాయి దుర్గేశ్ 934/1000(సీఈసీ) ఉత్తమ ఫలితాలు సాధించారు.

Similar News

News March 9, 2026

మా దేశ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అనవసరం: ఇరాన్ FM

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికలో విదేశీయుల ప్రమేయం అవసరం లేదని ఆ దేశ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు. ఖమేనీ వారసుడిని ఎన్నుకోవడంలో తాము సాయం చేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘మా దేశ వ్యవహారాల్లో ఇతరులను జోక్యం చేసుకోనివ్వం. ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ లీడర్‌ను నిర్ణయిస్తుంది’ అని చెప్పారు. కాగా కొత్త నాయకుడిగా మొజ్తాబా ఎన్నికైనట్లు వార్తలొస్తున్నాయి.

News March 9, 2026

గంభీర్.. ఒక్క ఫైనల్‌లోనూ ఓడలేదు

image

గౌతమ్ గంభీర్ ఇప్పటివరకూ ఒక్క ICC ఫైనల్ కూడా ఓడలేదు. భారత ప్లేయర్‌గా 2007 T20 WC, 2011 ODI WC, హెడ్ కోచ్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ(2025), టీ20 WC(2026) సాధించారు. ప్లేయర్‌గా 2010 ఆసియా కప్ కూడా గెలిచారు. అలాగే IPLలో KKRకి కెప్టెన్‌గా 2, మెంటార్‌గా ఒక టైటిల్ అందించారు. కోచ్‌గా జట్టులో, బ్యాటింగ్ ఆర్డర్‌లో తరచూ మార్పులు చేస్తున్నారని ఆయనపై విమర్శలొచ్చాయి. కానీ ఆ మార్పులే ఇప్పుడు విజయాన్ని కట్టబెట్టాయి.

News March 9, 2026

పాసర్లపూడిలో దారుణం.. డ్రైన్‌లో శిశువు మృతదేహం PHOTO

image

మామిడికుదురు మండలం పాసర్లపూడి బొమ్మిడిపాలెం వాడబోది డ్రైన్‌లో వారం రోజుల మగ శిశువు మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఎస్ఐ చైతన్య కుమార్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని రాజోలు ఆసుపత్రికి తరలించారు. ఈ అమానుష ఘటనకు పాల్పడిన వారు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పసికందు మరణంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.