News November 30, 2025

MHBD: ఊరి కోసం ఉద్యోగానికి రాజీనామా!

image

మహబూబాబాద్ మండలం సొమ్ల తండాకు చెందిన భూక్య కౌసల్య గ్రామానికి సేవ చేయడం కోసం తన అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా తొలి దశలో నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ సోదరుడు దల్సింగ్ సతీమణి అయిన కౌసల్య ప్రజాసేవ కోసం 37 ఏళ్లుగా విధులు నిర్వర్తించిన తన వృత్తిని వదులుకున్నారు.

Similar News

News February 13, 2026

గద్వాల ‘కోట’ ఎవరిది? మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ..!

image

గద్వాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్ గందరగోళంగా మారడంతో మున్సిపల్ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే సందిగ్ధం నెలకొంది. స్వతంత్ర అభ్యర్థులు ఇప్పుడు కింగ్ మేకర్లుగా మారారు. వారి మద్దతు కోరుతూ కాంగ్రెస్, BRS నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇతర పార్టీల కన్ను పడకుండా గెలిచిన అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించే క్రమంలో ఇరు పార్టీల లీడర్లు నిమగ్నమయ్యారు.

News February 13, 2026

శ్రీవారి విషయంలో తప్పు చేయను: చంద్రబాబు

image

AP: తిరుమల శ్రీవారి విషయంలో తెలిసి కానీ, తెలియకుండా కానీ ఏ తప్పు చేయనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వేంకటేశ్వరస్వామి రాష్ట్రంలో ఉండటం మన అదృష్టమన్నారు. ఆయనను తలుచుకుంటే హాయిగా నిద్ర వస్తుందని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ సున్నితమైన అంశమని, దానిపై ఎక్కువ మాట్లాడకూడదనుకున్నానని చెప్పారు. అయితే కొంత మంది కావాలనే భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని అసెంబ్లీలో మండిపడ్డారు.

News February 13, 2026

BREAKING.. పరకాల మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే!

image

పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ దక్కించుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వరుసగా రెండు, మూడో రౌండ్లలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఫస్ట్ రౌండ్లో 2 వార్డులు, రెండో రౌండ్లు 5 వార్డులు, మూడో రౌండ్లో 4 వార్డులు దక్కించుకుంది. మొత్తం 22 వార్డుల్లో ఇంకా రెండు వార్డుల లెక్కింపు మిగిలి ఉండగానే.. ఛైర్మన్ పీఠానికి కావాల్సిన 11 వార్డులను కైవసం చేసుకుంది.