News December 12, 2025
MHBD జిల్లాలో కాంగ్రెస్‌కే 80 సర్పంచ్ స్థానాలు

మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో రాత్రి 10 వరకు సర్పంచ్ ఫలితాలు వెలువడ్డాయి. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 155 గ్రామ పంచాయతీలకు గాను 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 146 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్-80, బీఆర్ఎస్-47, బీజేపీ-5, స్వతంత్ర అభ్యర్థులు-14 మంది సర్పంచ్‌లుగా గెలుపొందారు.
Similar News
News January 13, 2026
‘జిగురు అట్టల’తో రసంపీల్చే పురుగుల ఆటకట్టు

పంటలకు హానిచేసే రసం పీల్చే పురుగుల కట్టడిలో జిగురు అట్టలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అట్టల ఉపరితలంపై జిగురు ఉంటుంది. వాటిపై వాలే పురుగులు జిగురుకు అంటుకుపోయి మరణిస్తాయి. పసుపు రంగు జిగురు అట్టలు తెల్లదోమ, పచ్చదోమ, వివిధ రకాల ఈగలను.. తెలుపు అట్టలు నల్ల తామర, ఎర్ర నల్లి, బ్లాక్ త్రిప్స్.. నీలిరంగు అట్టలు తామర పురుగులు, పేనుబంక, మిడతలను ఆకర్షిస్తాయి. ఈ అట్టలపై వాలగానే ఆ పురుగులు అతుక్కుని చనిపోతాయి.
News January 13, 2026
పిల్లలకు భోగి పళ్లు పోస్తున్నారా?

ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రదోష వేళలో తూర్పు ముఖంగా కూర్చోబెట్టి భోగి పళ్లు పోయాలని పండితులు సూచిస్తున్నారు. తల్లి మొదట భోగి పళ్లతో బిడ్డకు 3 సార్లు సవ్యంగా, 3 సార్లు అపసవ్యంగా దిష్టి తీసి ఆపై తల మీద నుంచి పోయాలి. ఇలా చేస్తే నరదోషం తొలగిపోతుందని, నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. చివరగా పిల్లలకు హారతివ్వాలి. భోగి పళ్లలో ఏమేం ఉండాలి? ఎందుకు పోయాలి? భోగి మంటల ఆవశ్యకత కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News January 13, 2026
మేడారం: నైట్ షిఫ్ట్ పనులను తనిఖీ చేసిన కలెక్టర్

ములుగు కలెక్టర్ దివాకర మేడారంలో కలియ తిరుగుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం నైట్ షిఫ్టులో భాగంగా చేస్తున్న క్యూలైన్లు, గద్దెల విస్తరణ, కూడళ్లలో ఏర్పాట్లను పరిశీలించారు. అనుకున్న సమయానికి పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ములుగు ఆర్డీవో వెంకటేష్, పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ అధికారులు ఉన్నారు.


