News August 21, 2025
MHBD: జిల్లావ్యాప్తంగా మారిన వాతావరణం

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒకసారిగా పొడిగా మారింది. వర్షపాతం దాదాపుగా అన్ని ప్రాంతాలలో తక్కువగా నమోదయింది. జిల్లా వ్యాప్తంగా కేవలం 12.4 మిల్లీమీటర్ల వర్షపాతం, సగటున 0.8 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయిందని జిల్లా అధికారులు తెలిపారు. కేవలం కొత్తగూడ 3.8, గంగారం 8.6 మిమీ మాత్రమే వర్షపాతం నమోదయింది.
Similar News
News January 17, 2026
కొత్తగూడెం తొలి మేయర్ పీఠం ఆ వర్గానికే..

కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారిన తర్వాత తొలి ఎన్నికల్లో మేయర్ పీఠం ఎస్టీకి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మెజారిటీ జనాభా ఏజెన్సీ వాసులు కావడంతో, జనాభా ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తొలిసారిగా ఒక గిరిజన బిడ్డ మేయర్ పీఠాన్ని అధిష్టించనున్నారు. ఏజెన్సీ ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేరడంతో గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
News January 17, 2026
BCCI అబ్జర్వర్‌గా కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ

ఈ నెల 21న నాగపూర్‌లో జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ–20 మ్యాచ్‌కు BCCI అబ్జర్వర్‌గా కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ (KDCA) సెక్రటరీ ఎం. రవీంద్ర చౌదరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆయనకు అభినందనలు తెలిపింది. గత 40 సంవత్సరాలుగా క్రికెట్‌కు అందిస్తున్న సేవలకు ఇది తగిన గుర్తింపుగా క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
News January 17, 2026
జనగాం: పార్టీల సమక్షంలో మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారు: కలెక్టర్

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్లతో కలిసి రిజర్వేషన్ల జాబితాను వెల్లడించారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల మేరకే విభజన జరిగిందని స్పష్టం చేశారు.


