News March 14, 2025
MHBD: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

MHBDలో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI
Similar News
News March 27, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎకలవ్య అధ్యక్షుడిగా కోనేటి సాయి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఏకలవ్య అధ్యక్షుడిగా కొనేటి సాయిలు ఎన్నికయ్యారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన కోనేటి సాయిలును ఏకలవ్య జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానం చేశారు. అనంతరం సాయిలు మాట్లాడుతూ.. ఏకలవ్య ఎరుకల కుల సంఘాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని తెలిపారు.
News March 27, 2025
‘రామ జన్మభూమి’ ఎడిషన్ వాచ్‌తో సల్మాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘రామ జన్మభూమి’ స్పెషల్ ఎడిషన్ వాచ్ ధరించారు. దాదాపు రూ.34 లక్షలు విలువ చేసే ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ధరించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈనెల 30న థియేటర్లలో కలుసుకుందాం అని రాసుకొచ్చారు. ఆయన నటించిన ‘సికందర్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ ఫొటో షేర్ చేశారు. వాచ్‌లో రాముడు, హనుమంతుడు, అయోధ్య ఆలయ డిజైన్లు ఉన్నాయి.
News March 27, 2025
ఏప్రిల్ 3న వేములవాడకు రానున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

ఏప్రిల్ 3వ తేదీన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, ఐదుగురు సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలా దేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట ప్రవీణ్ వచ్చే నెల 3వ తేదీన జిల్లాలోని వేములవాడకు సాయంత్రం చేరుకుంటారు. 4వ తేదీన ఉదయం 6 గంటలకు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.