News January 28, 2026

MHBD: మున్సిపాలిటీల్లో తెగని టికెట్ల పంచాయితీ!

image

నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నామినేషన్ వేసినా బీ ఫాం ఇస్తేనే పార్టీ అభ్యర్థిగా చెల్లు బాటవుతుంది. అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల్లో ఇంకా ఎక్కడా అధికారికంగా అభ్యర్థులను ఖరారు చేయలేదు. బీ ఫాం చేతిలో పడేవరకు అభ్యర్థులకు టెన్షన్ తప్పడం లేదు. తప్పనిసరిగా బరిలో ఉంటామని చెప్పుకుంటూ టికెట్ పోటీ ఉన్న చోట్ల నాయకులు బెంగతో ఆయా పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు.

Similar News

News April 20, 2026

@4PM సింహాచలం: స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారంటే..!

image

సింహాచలంలో స్వామి నిజరూప దర్శనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు 81,238 మంది స్వామిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. క్యూ లైన్లలో బారులు తీరారు. వీరికి ఇబ్బంది కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే 6గంటల తరువాత భక్తులకు కొండ పైకి అనుమతించడం లేదన్నారు.

News April 20, 2026

NGKL: ఈ నెల 30న దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు

image

NGKL ఆర్టీసీ డిపో నుంచి ఈనెల 30న కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈ బస్సు 30న రాత్రి డిపో నుంచి బయలుదేరి మే 1న శనివారం తెల్లవారుజామున దత్తాత్రేయ ఆశ్రమానికి చేరుకుంటుందన్నారు. ఉదయం దత్తాత్రేయ స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో యానగుంది మానికేశ్వరీ మాత ఆశ్రమ దర్శనం ఉంటుందన్నారు. వివరాలకు 9490411591 సంప్రదించాలన్నారు.

News April 20, 2026

సేంద్రియ మేళా సూపర్‌ హిట్: కలెక్టర్

image

లూరులో నిర్వహించిన ‘రైతు సంపద’ సహజ, సేంద్రియ ఉత్పత్తుల మెగా మేళా విశేష స్పందనతో విజయవంతమైందని కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. రెండు రోజుల్లో 3,400 మంది సందర్శించగా, రూ. 11 లక్షల విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. వ్యవసాయ శాఖ జేడీ భాషా, అధికారులను సన్మానించిన కలెక్టర్.. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని కోరారు.

↑