News September 10, 2025

MHBD: యూరియాపై రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి: కలెక్టర్

image

యూరియా సమాచారాన్ని రైతులకు ముందస్తుగా అందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. వ్యవసాయ, సహకార, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ప్రతి కేంద్రంలో రైతులకు కావాల్సిన తాగునీరు, టెంట్లు సౌకర్యాలు కల్పించాలన్నారు. అదనపు యూరియా కొనుగోలు కేంద్రాల కోసం సంబంధిత అధికారులతో కలిసి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.

Similar News

News December 10, 2025

తూగో: కోళ్ల ఓనర్స్ గుండెల్లో గూడ్స్ రైళ్లే..!

image

సంక్రాంతి సమీపిస్తున్న వేళ గోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల చోరీలు కలకలం రేపుతున్నాయి. కొనుగోలుదారుల రూపంలో వచ్చి పుంజుల రంగు, జాతిని పరిశీలించి, అదను చూసి రాత్రి వేళల్లో వాటిని మాయం చేస్తున్నారు. తాజాగా తాడేపల్లిగూడెంలో భారీగా కోళ్లు చోరీకి గురయ్యాయి. రూ.వేల విలువైన కోళ్లకు కాపలా కాసేందుకు యజమానులకి కునుకు లేకుండా పోతోంది. మరోవైపు ఆన్‌లైన్‌లోనూ కోళ్ల ఫోటోలు పెట్టి అడ్వాన్సుల పేరుతో మోసగిస్తున్నారు.

News December 10, 2025

చొప్పదండి: సర్పంచ్ బరిలో ఒకే పేరున్న ముగ్గురు పోటీ

image

సాధారణంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లు వేర్వేరుగా ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో కొందరు అభ్యర్థుల పేర్లు ఒకేవిధంగా ఉన్నా ఇంటి పేర్లు మాత్రం వేరుగా ఉంటాయి. అలాంటీ సీనే చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో నెలకొంది. ఇక్కడ శ్రీనివాస్ అనే పేరున్న(ఇంటి పేర్లు వేరు) ముగ్గురు అభ్యర్థులు గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. దీంతో ఏ శ్రీనివాస్ గెలుస్తాడోనన్న ఆసక్తి మాత్రం మండల వ్యాప్తంగా ఉంది.

News December 10, 2025

పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ భద్రత: ఎస్పీ శరత్ చంద్ర పవార్

image

జిల్లా పరిధిలోని మూడు దశల్లో 869 గ్రామపంచాయతీలో జరిగే ఎన్నికలకు 1,680 పోలీస్ సిబ్బందితో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే 100కి సమాచారం అందించాలని కోరారు.