News August 21, 2025
MHBD: యూరియా క్యూలో తోపులాట.. వృద్ధుడికి గాయాలు

మరిపెడ మండల కేంద్రంలో యూరియా కోసం క్యూలో నిల్చున్న రైతుల మధ్య తోపులాట జరగడంతో ఓ వృద్ధుడు జారిపడి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మండల కేంద్రంలోని ఆగ్రోస్ సేవా కేంద్రం ముందు యూరియా ఇస్తుండడంతో రైతులు గుంపుగా అక్కడికి చేరుకున్నారు. క్యూలో నిలబడడం కోసం ఒకరినొకరు తోసుకోవడంతో చిల్లంచెర్ల గ్రామానికి చెందిన అజ్మీర లక్క అనే వృద్ధుడు జారిపడి తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం అయింది. వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News January 13, 2026
మిగిలిన భోగి పళ్లను ఏం చేయాలి?

భోగి పళ్లు పోసిన తర్వాత కింద పడిన పళ్లను పిల్లలు ఏరుకుంటారు. ఆ తర్వాత మిగిలిపోయిన పళ్లను బయట పడేయకూడదు. వాటిని శుభ్రం గోమాతలకు పెట్టడం వల్ల శుభం కలుగుతుంది. ఇతర మూగజీవాలకు ఆహారంగా వేయడం కూడా చాలా మంచిది. ఇలా చేస్తే పళ్లు వృధా కాకుండా ఉండటమే కాకుండా, పశువులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా దక్కుతుంది. ప్రకృతితో ముడిపడి ఉన్న మన సంప్రదాయాల్లో జీవ కారుణ్యం కూడా భాగమని చెప్పడానికి ఇదో నిదర్శనం.
News January 13, 2026
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ శ్రావణి

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి సూచించారు. సోమవారం తన కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కోడి పందేలు, గుళ్ల ఆటలపై నిషేధం ఉందన్నారు. వాటి జోలికి దూరంగా ఉండాలని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News January 13, 2026
MDK: ఆపరేషన్ స్మైల్.. అమ్మనాన్న మీ దగ్గరికి వచ్చేశా!

రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా మెదక్ జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి జరుగుతోందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. 10 రోజుల్లో 26 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించగా, 9 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై 28 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.


