News September 10, 2025

MHBD: లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి: SP

image

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పర్యవేక్షణలో ఈనెల 13న అన్ని కోర్టుల ప్రాంగణంలో నిర్వహించబోయే లోక్ అదాలత్ సద్వినియోగపరచుకోవాలని MHBD ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. భూ వివాదాలు, రోడ్డు పరిహార క్లెయిమ్‌లు, బ్యాంకు రుణ వివాదాలు, దాంపత్య/కుటుంబ గొడవలు, ఆస్తి తగాదాలు మొదలగు రాజకీయ వీలైన అన్ని రకాల సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు.

Similar News

News December 8, 2025

ఇంద్రకీలాద్రి: నూతన లడ్డూ ప్రసాదం పోటు ప్రారంభం

image

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణ మహోత్సవాలను పురస్కరించుకొని దుర్గమ్మ ఆలయంలో లడ్డూ ప్రసాదం పోటు తయారీకి నూతన వంటశాలను ప్రారంభించారు. దేవస్థానం ఈఓ శీనా నాయక్ కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. భవానీ భక్తులకు నాణ్యమైన, రుచికరమైన లడ్డూ ప్రసాదం అందించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

News December 8, 2025

MIDHANIలో 210 పోస్టులు.. అప్లై చేశారా?

image

మిశ్రమ ధాతు నిగమ్(MIDHANI)లో 210 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BE, బీటెక్, ITI, డిప్లొమా అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. ITI ట్రేడ్ అప్రెంటిస్‌కు నెలకు రూ.9,600, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,300, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.10,900 చెల్లిస్తారు.

News December 8, 2025

కర్నూలు: హలో యువత మేలుకో పోస్టర్ విడుదల

image

కర్నూలు జిల్లాలో యువతలో మత్తు పదార్థాల ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి అయ్యప్ప రాష్ట్ర సమితి ముద్రించిన “హలో యువత మేలుకో-చెడు వ్యసనాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకో” నినాదంతో వాల్ పోస్టర్లను అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐలు శ్రీధర్, చాంద్ బాషా, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు నాగరాజు, నాయకులు చంటి, దస్తగిరి పాల్గొన్నారు.