News February 1, 2025
MHBD: సారాయి విక్రేతకు రూ.50,000 జరిమానా

మహబూబాబాద్ మండలం అనంతారంకు చెందిన పగడయ్య గతంలో సారాయి రవాణా చేస్తూ పట్టు పడ్డాడని, కేసు నమోదు చేశామని ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు. శుక్రవారం అతను మరల సారాయితో పట్టు పడగా.. అతనిపై కేసు నమోదు చేసి తహశీల్దార్ ముందు హాజరు పరచారు.ఆయన అతనికి Rs.50,000 జరిమానా విధించారు.
Similar News
News April 18, 2026
జీవప్రాణులకు జలమే ఆధారం: VZM కలెక్టర్

జీవప్రాణులకు జలమే ఆధారమని విజయనగరం కలెక్టర్ రాంసుందర రెడ్డి పేర్కొన్నారు. శనివారం అలకనంద కాలనీలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్రలో భాగంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఇంకుడు గుంతను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకొనే విధంగా ప్రజా చైతన్యం రావాలన్నారు. భూగర్భ జలాలను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
News April 18, 2026
KNR: మైనారిటీ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు

జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్వర్ తెలిపారు. ఆస్ట్రేలియా, ఓమన్, జర్మనీ, గ్రీసీ, ఖతార్ తదితర దేశాల్లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయని, ఐటీఐ, డిగ్రీ, పీజీ, డిప్లోమా, నర్సింగ్ కోర్సులు చదివి 21 నుంచి 58 ఏళ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9440051285, 9440051452 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
News April 18, 2026
పోలీసులకు వారాంతపు సెలవులపై చర్యలు తీసుకోవాలి: ADB SP

పోలీసులకు వారాంతపు సెలవులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎండాకాలం దృష్ట్యా సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత నీరు తాగడం, ఎండలో బయటకు వెళ్లే సందర్భంలో రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. త్వరలోనే సిబ్బందికి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్రమాలపై సమాచారం అందించిన సిబ్బందికి ప్రోత్సహిస్తామన్నారు.


