News March 7, 2025
MHBD: స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశాలు

MHBD జిల్లా స్పోర్ట్స్ స్కూల్లో 2025-26 సంవత్సరానికి సెలక్షన్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ట్రైబల్ వెల్ఫేర్ ఉపసంచాలకుడు దేశీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగూడలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో మొత్తం 81 సీట్లు ఉన్నాయన్నారు. ఈనెల 15న దరఖాస్తులకు చివరి తేదీ అన్నారు. పూర్తి సమాచారం కోసం 99492440710, 9492440711, 9866694412 నంబర్లలో సంప్రదించాలన్నారు.
Similar News
News December 6, 2025
కృష్ణా: నకిలీ సిమ్‌లు.. మరో 8 మందికి సంకెళ్లు

వినియోగదారుల ఆధార్ వివరాలు, వేలిముద్రలతో అక్రమంగా సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్న సైబర్ మోసగాళ్ల ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు ముమ్మరం చేసి, తాజాగా మరో 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో కృష్ణా జిల్లా పెడన ప్రాంతానికి చెందిన ఐదుగురు ఉండగా, ఈ మోసాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
News December 6, 2025
VZM: రెస్ట్ కోసం కారు ఆపితే..!

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఉహించలేరు. విజయనగరం జిల్లాకు చెందిన పలువురు <<18484112>>స్వాములు<<>> అయ్యప్పకు ఇరుముడి సమర్పించారు. అనంతరం శబరిమల నుంచి కారులో తిరుగుపయనమయ్యారు. రాత్రి ప్రయాణం ప్రమాదమని భావించి రామేశ్వరం వద్ద రోడ్డు పక్కన వాహనం ఆపారు. అందరూ నిద్రలో ఉండగా మృత్యు లారీ కారు మీదకు దూసుకు రావడంతో నలుగురు చనిపోయారు. వీరి మరణ వార్త విన్న కుటుంబీకులు, గ్రామస్థులు విషాదంలో మునిగారు.
News December 6, 2025
నాగర్ కర్నూల్: అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది. తుఫాన్ ప్రభావం వల్ల వారం రోజులపాటు చలి తీవ్రత తగ్గినప్పటికీ రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా చలి పెరిగింది. శనివారం వెల్దండలో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తోటపల్లి 14, కల్వకుర్తి 14.4, బిజినపల్లిలో 14.7 డిగ్రీలు నమోదయ్యాయి.


