News November 1, 2025

MHBD: అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

ఇందిరమ్మ ఇండ్లు, రెండు పడకల గదుల నిర్మాణ పథకం అమలు పురోగతిపై సంబధిత అధికారులతో కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ సమావేశం నిర్వహించారు. పేదల సొంతింటి నిర్మాణం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం అమలు క్షేత్రస్థాయిలో తీసుకొని సర్వే, మార్కింగ్, గ్రౌండింగ్ పురోగతిలో ముందుకు సాగాలన్నారు.

Similar News

News November 2, 2025

బద్ది పోచమ్మ ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ అమ్మవారి దేవాలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కార్తీక మాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని, శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో బద్ది పోచమ్మ ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

News November 2, 2025

సంగారెడ్డి: ఈనెల 4న యువజనోత్సవాలు

image

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 4న జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన సంక్షేమ అధికారి ఖాసీంభేగ్ ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వెల్లడించారు.

News November 2, 2025

‘RSS బ్యాన్’ వ్యాఖ్యలు.. ఖర్గేకు అమిత్ షా కౌంటర్

image

RSSను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. RSSను ‘దేశభక్తి సంస్థ’ అని కొనియాడారు. ‘దేశాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చేందుకు నాలాంటి ఎంతో మందికి RSS స్ఫూర్తినిచ్చింది. దేశభక్తి, క్రమశిక్షణను పెంపొందించింది. ఉత్తమ PMల జాబితాలో నిలిచే వాజ్‌పేయి, మోదీ ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చారు’ అని చెప్పారు. ఖర్గే కోరుకున్నది ఎప్పటికీ జరగదన్నారు.