News December 9, 2025

MHBD: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

image

తొలి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జిల్లాలో తొలి దశ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ శబరీష్, అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ఎన్నికల వ్యయ పరిశీలకులు మధుకర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 10, 2025

గ్లోబల్ సమ్మిట్: ఆ విద్యార్థులకే అనుమతి

image

TG: గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల సందర్శనకు ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులనే ఇవాళ అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ పాఠశాలలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎంపిక చేస్తారని చెప్పింది. 2PM నుంచి 7PM వరకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. గురువారం నుంచి మిగిలిన రోజుల్లో ఎవరెవరికి ప్రవేశం ఉంటుందనే విషయాన్ని నేడు ప్రకటిస్తామని వెల్లడించింది.

News December 10, 2025

VZM: ‘గ్రామీణ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.84.62 కోట్లు మంజూరు’

image

జిల్లాలో గ్రామీణ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.84.62 కోట్లు మంజూరయ్యాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. మొత్తం 67 పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందన్నారు. బొబ్బిలి-8, చీపురుపల్లి-10, గజపతినగరం-7, నెల్లిమర్ల-17, రాజాం-6, ఎస్‌.కోట-7, విజయనగరం-12 పనులకు ఆమోదం లభించిందన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఈ అనుమతులు వచ్చినట్లు వెల్లడించారు.

News December 10, 2025

తిరుమల: కల్తీ గురించి ఎవరికి చెప్పారు..?

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ కస్టడీలో తొలి రోజు అధికారులు అడిగిన ప్రశ్నలకు ఏ-16 అజయ్ కుమార్ సుగంధ్, ఏ-29 సుబ్రహ్మణ్యం పలు సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. నెయ్యికి కెమికల్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిసే చేశారా? దీని గురించి ఎవరెవరితో మాట్లాడారు? అసలు కల్తీ అని గుర్తించి టీటీడీ అధికారులకు చెప్పారా లేదా అంటూ ప్రశ్నించారు. సాయంత్రం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.