News December 7, 2025
MHBD: ముగిసిన చివరి దశ స్క్రూటీని

జిల్లా వ్యాప్తంగా రెండో దశ అభ్యర్థుల స్క్రూటీని ప్రక్రియ ముగిసింది. డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, సీరోల్, మరిపెడ మండలాల్లో మొత్తం 169 జిపి లకు 1185 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. శనివారం స్క్రూటీనీ అనంతరం 925 మంది నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. కాగా 1412 వార్డ్ మెంబర్ స్థానాలకు 3,592 నామినేషన్లు స్వీకరించగా 3,408 చెల్లుబాటు అయినట్లు అధికారులు ప్రకటించారు.
Similar News
News December 9, 2025
ప్రమాదంలో పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు మృతి

నగరి పోలీస్ స్టేషన్ పరిధి తడకుపేట సమీపంలో రెండు కార్లు ఢీకొని <<18510891>>ముగ్గురు చనిపోయిన<<>> విషయం తెలిసిందే. మృుతల్లో ఇద్దరిని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పని చేసే పోటు కార్మికులు శంకర్, సంతానంగా గుర్తించారు. వీరు తిరుత్తణికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇదే ప్రమాదంలో ఎదురుగా వచ్చిన కారులో వ్యక్తి సైతం మరణించాడు. పోలీసులు విచారణ చేపట్టారు.
News December 9, 2025
MDK: తొలి విడత పోరు.. ప్రచారానికి తెర నేడు.!

హోరా హోరీగా సాగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటల తర్వాత తెర పడనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు తెల్లవారుజాము నుంచే ప్రచారం షురూ చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తొలి విడతలో SDPT జిల్లాలో 163 జీపీలు, 1432 వార్డులు, MDKలో 160 జీపీలు, 1402 వార్డులు, SRDలో 136 జీపీలు,1246 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
News December 9, 2025
MBNR: స్థానిక ఎన్నికలు.. పలు పరీక్షలు వాయిదా

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1,3,5 సెమిస్టర్ పరీక్షలను స్థానిక ఎన్నికల కారణంగా పలు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. వాయిదా పడిన పరీక్షలను 18 తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు గమనించాలని సూచించారు.


