News September 9, 2025

MHBD: 146 మంది జీపీవోలకు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ

image

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని 146 మంది గ్రామ పరిపాలన అధికారులకు అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, అనిల్ కుమార్ పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో 146 మంది GPOలు వారు కోరుకున్న ఆప్షన్ ప్రకారం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News December 5, 2025

అర్హులందరికీ జీవన భృతి: మంత్రి అచ్చెన్న

image

మొంథా తుఫాన్ కార‌ణంగా ప్ర‌భుత్వం వేటకు వెళ్లరాద‌ని ప్రకటించడంతో మ‌త్స్య‌కారులు 5 రోజులు పాటు వేట‌కు
వేళ్ల‌లేదు. జీవన భృతిని ప్ర‌భుత్వం ఇస్తుంద‌ని ప్ర‌క‌టించింది. దీంతో వారంద‌రికీ 50 కేజీల బియ్యాన్ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులంద‌రికీ భృతి పంపిణీ చేసేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని మంత్రి హామీ ఇచ్చారు.

News December 5, 2025

పార్వతీపురంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ఘన ప్రారంభం

image

పార్వతీపురంలో శుక్రవారం CMR షాపింగ్ మాల్‌ను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ కలిసి ప్రారంభించారు. CMR లాంటి పెద్ద సంస్థ పార్వతీపురంలో రావటం వలన అనేక మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే అన్నారు. పార్వతీపురం ప్రజలు ఏదైనా శుభకార్యాలకు షాపింగ్ చేయాలంటే విశాఖ, విజయవాడ వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ప్రజలకు అన్ని ఒకే చోట లభిస్తాయని చెప్పారు.

News December 5, 2025

అరసవల్లి రథసప్తమికి పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి మహోత్సవ ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టర్ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం పటిష్ఠమైన క్యూలైన్ల ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. భక్తుల భద్రత దృష్ట్యా క్యూలైన్లలో సీసీ కెమెరాలు, స్క్రీన్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.