News November 12, 2025

MIDHANIలో 210 పోస్టులు

image

మిశ్రమ ధాతు నిగమ్(<>MIDHANI<<>>)లో 210 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. BE, బీటెక్, ITI, డిప్లొమా అర్హతగలవారు DEC 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. ITI ట్రేడ్‌కు నెలకు రూ.9,600, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,300, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.10,900 చెల్లిస్తారు.

Similar News

News November 12, 2025

జల సంరక్షణలో తెలంగాణ నంబర్-1

image

జాతీయ జల అవార్డులు-2024లో జల్ సంచయ్ జన్ భాగీదారీ(ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ) విభాగంలో TG ఫస్ట్ ర్యాంక్ సాధించింది. 5,20,362 పనులు పూర్తిచేసి ఈ ఘనత సాధించింది. జిల్లాల్లో ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల టాప్‌లో నిలిచాయి. ఇదే కేటగిరీ మున్సిపల్ విభాగంలో రాజమండ్రి(AP) 4వ ర్యాంకు సాధించింది. దీంతో ఒక్కో జిల్లాకు రూ.2 కోట్ల నగదు బహుమతి రానుంది. ఈ నెల 18న రాష్ట్రపతి ముర్ము పురస్కారాలను అందజేస్తారు.

News November 12, 2025

సీరం వాడుతున్నారా?

image

చర్మ సంరక్షణలో సీరం కీలకపాత్ర పోషిస్తుంది. మీకున్న చర్మ సమస్యకు తగిన సీరం ఎంచుకోవడం ముఖ్యం. విటమిన్ సి సీరం వృద్ధాప్య ఛాయల్ని, హ్యాలురోనిక్ యాసిడ్ ఉన్న సీరం చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ముఖంపై ముడతలు ఉంటే రెటినాల్ సీరం, కాలుష్యం వల్ల దెబ్బతిన్న చర్మానికి బీటా కెరొటిన్, గ్రీన్ టీ, బెర్రీలు, దానిమ్మ, ద్రాక్ష గింజల సారం ఉన్న సీరం మంచిది. సున్నిత చర్మం ఉంటే యాంటీఇన్ఫ్లమేటరీ సీరం ఎంచుకోవాలి.

News November 12, 2025

నేడు విచారణకు ప్రకాశ్ రాజ్

image

బెట్టింగ్ యాప్స్ కేసులో నోటీసులు అందుకున్న నటుడు ప్రకాశ్ రాజ్ ఇవాళ CID విచారణకు హాజరుకానున్నారు. నిన్న విజయ్ దేవరకొండను విచారించిన అధికారులు.. బ్యాన్డ్ యాప్స్‌ను ఎలా ప్రమోట్ చేశారు? ఏ ఒప్పందాలు జరిగాయి? రెమ్యునరేషన్ ఎంత? తదితర అంశాలపై గంట పాటు ప్రశ్నించారు. ఇందుకు తాను చట్టబద్ధంగా A23 యాప్‌ను ప్రమోట్ చేశానని విజయ్ పలు ఆధారాలు సమర్పించారు.