News August 24, 2024
ఆ నలుగురికి మంత్రి పదవులు?

TG: అధిష్ఠానంతో భేటీలో మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది. సుదర్శన్ రెడ్డి, నీలం మధు ముదిరాజ్‌తో పాటు మరో ఇద్దరి పేర్లను రేవంత్ సూచించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవంగా 6 మంత్రి పదవులున్నప్పటికీ పోచారం శ్రీనివాసరెడ్డి, కేకేకు కేబినేట్ హోదా ఇవ్వడంతో ఇక నాలుగు మంత్రి పదవుల్నే కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Similar News
News January 15, 2026
మీ ఇంటి గోవులను రేపు ఎలా పూజించాలంటే?

కనుమ రోజున ఆవులను, ఎడ్లను చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చు.
News January 15, 2026
DRDOలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్‌లోని <
News January 15, 2026
U19 WC: టాస్ గెలిచిన టీమ్ ఇండియా

అండర్-19 వరల్డ్ కప్‌లో యూఎస్ఏతో మ్యాచులో టీమ్ ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
USA: ఉత్కర్ష్ శ్రీవాస్తవ(C), అద్నిత్, నితీశ్, అర్జున్ మహేశ్, అమరీందర్, సబ్రిశ్, అదిత్, అమోఘ్, సాహిల్, రిషబ్, రిత్విక్
ఇండియా: ఆయుశ్ (C), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, విహాన్, అభిజ్ఞాన్, హర్‌వంశ్, అంబ్రీశ్, కనిశ్ చౌహన్, హెనిల్ , దీపేశ్, ఖిలన్.
* మ్యాచ్ లైవ్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో చూడవచ్చు.


