News April 12, 2024
అయోధ్యలో అద్భుతం.. 17న రామయ్యకు ‘సూర్య తిలకం’

అయోధ్యలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. బాలరాముడు కొలువుదీరిన తర్వాత తొలిసారి ఈ నెల 17న శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఆ రోజున మధ్యాహ్నం 12 గంటలకు రాముడి నుదుటిపై 75MM వ్యాసార్థంతో సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. దాదాపు 6 నిమిషాలపాటు ఈ అపురూప దృశ్యం భక్తులకు కనువిందు చేయనుంది. ఏటా నవమి రోజున ఇలా జరిగేలా ఆలయాన్ని నిర్మించారు.
Similar News
News December 13, 2025
పత్తి కొనుగోలుకు రైతులు పేర్లు నమోదు చేసుకోవాలి: కలెక్టర్

పత్తి పంటను కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవడానికి ‘కపాస్ కిసాన్ యాప్’లో రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పత్తి పంట సేకరణకు ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. జిల్లాలోని పత్తి రైతులు గుంటూరు లేదా పల్నాడు జిల్లాలలో తమ పత్తి పంటను అమ్ముకోవచ్చన్నారు. రైతులు ముందస్తుగా యాప్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

శుభ సమయం (13-12-2025) శనివారం

➤ తిథి: బహుళ నవమి రా.7.21 వరకు
➤ నక్షత్రం: ఉత్తర ఉ.9.33 వరకు
➤ శుభ సమయాలు: ఏమీ లేవు
➤ రాహుకాలం: ఉ.9 నుంచి 10.30 వరకు
➤ యమగండం: మ.1.30 నుంచి 3 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.6 నుంచి 7.36 వరకు
➤ వర్జ్యం: సా.6.27 నుంచి రా.8.08 వరకు
➤ అమృత ఘడియలు: సా.5.01 నుంచి 6.41 వరకు