News April 25, 2024
నా వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించారు: రాయుడు

ముంబై ఇండియన్స్‌పై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించారని ఆ జట్టు మాజీ ప్లేయర్ అంబటి రాయుడు ట్వీట్ చేశారు. ఒక ఆటగాడు అత్యుత్తమంగా మారేందుకు ఆ జట్టులో సానుకూల ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నట్లు తెలిపారు. భారత జట్టుకు ముంబై ఇండియన్స్ నుంచి వచ్చిన ఆటగాళ్ల రికార్డులు చూస్తే ఆ విషయం అర్థమవుతుందన్నారు. ముంబై జట్టుకు ఎనిమిదేళ్లపాటు ఆడటం గొప్పగా ఉందని చెప్పారు.
Similar News
News January 14, 2026
పితృ దేవతలకు నేడు తర్పణాలు వదిలితే..

మకర సంక్రాంతి ఎంతో పవిత్ర దినం. తండ్రీకొడుకులైన సూర్యశనుల కలయికకు ఇది ప్రతీక. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు విడిచి, పేదలకు అన్నదానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. కొత్త కుండలో పాలు పొంగించి సూర్యుడికి నైవేద్యం సమర్పిస్తారు. శని దోష నివారణకు నువ్వులు, బెల్లం, గుమ్మడికాయలు దానం చేస్తారు. పంట చేతికి వచ్చే ఈ ‘కుప్ప నూర్పిడుల పండుగ’ వెలుగును, ఆరోగ్యాన్ని, సిరిసంపదలను ప్రసాదించే గొప్ప వేడుక.
News January 14, 2026
చేపల చెరువుల్లో నీటి పీహెచ్ స్థాయి ఎంత ఉండాలి?

☛ చేపలు ఎక్కువగా పీహెచ్ స్థాయి 7.0-8.5 మధ్య ఉన్న చెరువు నీటిలో బాగా పెరుగుతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 6.5 కన్నా తక్కువైతే (ఆమ్ల ధర్మం గల నీరు) చేపలు బలహీనమై, వ్యాధుల బారినపడతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 9 కన్నా ఎక్కువైతే (క్షార ధర్మం గల నీరు) చేపల మొప్పలు దెబ్బతిని, ప్రాణ వాయువుని గ్రహించే శక్తి చేపల్లో తగ్గుతుంది. అందుకే నీటి పీహెచ్ స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
News January 14, 2026
వంటింటి చిట్కాలు

* గార్లిక్ బ్రెడ్ అందుబాటులో లేనప్పుడు కొన్ని వెల్లుల్లి రేకలను మెత్తగా చేసి ఓ గంట పెరుగులో నానబెట్టి దాన్ని బ్రెడ్ స్లైసుల మీద పరిచి టోస్ట్ చేస్తే సరిపోతుంది.
* కూరల్లో గ్రేవీ పలుచగా అయితే కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* మాంసాన్ని సన్నని స్లైసుల్లా తరగాలనుకుంటే, కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి, చాకుతో కోస్తే ఈజీగా వస్తాయి.
* సాంబారు రుచిగా ఉండాలంటే మసాలా పొడిలో కొద్దిగా నిమ్మరసం చేర్చాలి.


